ఒకసారి దెబ్బపడితే మళ్ళీ ఆ రూట్ లో వెళ్ళడానికి సినిమా కెరీర్ లో హీరోలు చాలా బయపడతారు. అయితే మాస్ రాజా మాత్రం అస్సలు పట్టించుకోకుండా మళ్ళీ రొటీన్ గానే సినిమాలు చేస్తూ ప్లాప్ లు అందుకుంటున్నట్లు విమర్శలు అందుకుంటున్నాడు. ఇది మొండితనం అనుకోవాలా లేక కెరీర్ ను లైట్ తీసుకున్నాడా? అనే విషయం అర్ధం కాకుండా ఉంది. 

రాజా ది గ్రేట్ కి ముందు ఎప్పుడు లేని విధంగా వరుస ప్లాప్ లు ఎదుర్కొన్న రవితేజ ఆ తరువాత డిఫరెంట్ సినిమాలి సెలెక్ట్ చేసుకొని మారతాడని అంతా అనుకున్నారు. కానీ అదే ఫార్మాట్ లో వెళ్లి డిజాస్టర్స్ అందుకున్నాడు. గత ఏడాది నేల టిక్కెట్టు - టచ్ చేసి చూడు డిజాస్టర్స్ గా నిలిచాయి. అంతకంటే ఎక్కువగా అమర్ అక్బర్ ఆంటోని దెబ్బేసింది. 

మార్కెట్ డౌన్ అవుతున్న సమయంలో ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విఐ.ఆనంద్ చెప్పిన కథను ఒకే చేశాడు. అయితే ఆ సినిమా సెట్స్ పైకి వచ్చేసరికి కథలో పస లేదని ఎదో మిస్సయ్యిందని మాస్ రాజా అభ్యంతరం చెప్పడంతో సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ఇక ఇంతలో కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ గతంలో చెప్పిన తేరి రీమేక్ కథను స్టార్ట్ చేయాలనీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. 

అది రెగ్యులర్ కమర్షియల్ కథలనే ఉండటంతో మొదట నో చెప్పిన మాస్ రాజా మళ్ళీ అదే కథను సెట్స్ పైకి తేనున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. పనిలో పనిగా విఐ ఆనంద్ తన కథలో మార్పులు చేసి తీసుకువస్తే ఆ కథను కూడా మొదలెట్టాలని రవితేజ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి మాస్ రాజా ఈ రొటీన్ ఫార్మాట్ లో ఎంతవరకు హిట్టందుకుంటాడో చూడాలి.