డిస్కో రాజా సినిమాపై మాస్ మహా రాజా గట్టి నమ్మకమే పెట్టుకున్నాడు. ఆ పాత్ర కోసం స్పెషల్ గా ఫిట్ నెస్ లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. రూమర్స్ ప్రకారం సినిమాలో రవితేజ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడట. ఒకటి పండు ముసలి వ్యక్తిగా అలాగే మరో స్క్రీన్ ప్లే లో యంగ్ రాజా గా అలరిస్తాడని సమాచారం. 

డిఫరెంట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విఐ.ఆనంద్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో సోషియో ఫాంటసీగా దర్శకుడు కథను సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే రవితేజ వృద్ధాప్యంలోకి వచ్చాక తన శత్రువులపై పాగా తీర్చుకోవడానికి ఒక ప్రయోగం ద్వారా ఎలా యువకుడిగా మారి రివెంజ్ తీర్చుకున్నాడు అనేదే అసలు కథ అని తెలుస్తోంది. 

ఇక సినిమా షూటింగ్ ను మార్చ్ 1 మొదలెట్టి వీలైనంత త్వరగా రిలీజ్ చెయ్యాలని రవితేజ నిర్మాతలతో చర్చలు జరుపుతున్నారు. రాజా ది గ్రేట్ హిట్ అనంతరం నేల టిక్కెట్టు - టచ్ చేసి చూడు అలాగే అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఈ సినిమాను ఇదే ఏడాది సమ్మర్ తరువాత రిలీజ్ చెయ్యాలని మాస రాజా ఆలోచన. మరి ఈ ప్రయోగాత్మకమైన సినిమాతో మాస్ రాజా ఎంతవరకు హిట్ అందుకుంటాడో చూడాలి.