మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం 'నేల టికెట్టు'. ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈసారి రవితేజ హీరోగా పక్కా మాస్ ఫిల్మ్ ను రూపొందించారు. ఈ సినిమా ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది చిత్రబృందం. ట్రైలర్ ను బట్టి ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ను మేళవించి సినిమా చేసినట్లు తెలుస్తోంది. హీరోయిన్ తో హీరో ప్రేమలో పడడం, తన ఎదుగుదల కోసం ఏదైనా చేసే విలన్ ను హీరో ఎదిరించడం.. దానికి ఓ సందేశాన్ని కూడా జోడించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ లో చూపించిన 'నేల టికెట్టు' అనే సాంగ్ మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక రవితేజ చెప్పిన డైలాగ్స్.. 'చుట్టూ జనం.. మధ్యలో మనం.. అది కదరా లైఫ్..'

'ముసలితనం అంటే చేతకానితనం కాదు నిలువెత్తు అనుభవం' 

'నువ్ రావడం కాదు నేనే వస్తున్నా.. ఇదే మూడ్ మైంటైన్ చెయ్'

'నేల టికెట్టు' గాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు' వంటి మాటలు హైలైట్ గా నిలిచాయి. మల్వికా శర్మా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మే 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.