రవితేజ చాలా రోజులు తర్వాత సూపర్‌ హిట్‌ అందుకున్నారు. తనకు `బలుపు` వంటి హిట్‌ చిత్రాన్ని అందించిన గోపీచంద్‌ మలినేని డైరెక్షన్‌లో శృతి హాసన్‌ హీరోయిన్‌గా, ఇటీవల `క్రాక్‌` చిత్రంలో విజయాన్ని అందుకుని పూర్వవైభవాన్ని సొంతం చేసుకున్నారు. సంక్రాంతి కానుకగా పలు అడ్డంకులు ఎదుర్కొని విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సందడి చేసి, సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. 

ఇప్పుడు డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లోనూ ఎంటర్‌టైన్‌ చేయడానికి రాబోతుంది. ఈ సినిమా రేపు(ఈ నెల 5న) `ఆహా` ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది. ఈ విషయాన్ని ఆహా` సీఈఓ అజిత్‌ ఠాకూర్‌ తెలిపారు. బలమైన కంటెంట్‌ని అందించే ఓటీటీ మరో బిగ్‌ సినిమాతో రాబోతుందని తెలిపారు. శుక్రవారం నుంచి బిగ్‌ సూపర్‌ హిట్‌ `క్రాక్‌` తమ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానుందని చెప్పారు. థియేటర్‌లో భారీ కలెక్షన్లని సాధించిన ఈ సినిమా ఓటీటీలోనూ సత్తా చాటుతుందని, ఆడియెన్స్ కి కావాల్సిన వినోదాన్ని పంచుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. 

`ఓ పెద్ద సినిమాతో ఈ ఏడాది ఆడియెన్స్ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇండస్ట్రీలోని బిగ్‌ స్టార్స్ రవితేజ, శృతి హాసన్‌ కలిసి నటించిన చిత్రమిది. ఈ సినిమాతో మా లైబ్రరీ మరింత బలోపేతం అయ్యింది. అది టైర్‌ 2,  3 మార్కెట్‌లో తెలుగు ఆడియెన్స్ కి మరింతగా రీచ్‌ అయ్యే అవకాశం ఉంది. `ఆహా దాదాపు 24.5 మిలియన్లకు పైగా ఆడియెన్స్ కి రీచ్‌ అయ్యింది. దాదాపు ఎనిమిది మిలియన్లు మంచి `ఆహా` యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇక మన్ముందు మరింతగా విస్తరిస్తాం` అని చెప్పారు.