రవితేజ హీరోయిన్ల గురించి మాట్లాడుతూ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ హీరోయిన్స్ ఇద్దరితో వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను.
మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఖిలాడీ. ఫిబ్రవరి 11న ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. దీనితో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో రవితేజకి జోడిగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
చిత్ర యూనిట్ బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ సినిమా గురించి అనేక విషయాలు మాట్లాడారు. నిర్మాత కోనేరు సత్యనారాయణ ఈ చిత్రానికి అద్భుతమైన టెక్నీషియన్లు అందించారని అన్నారు. కోనేరు సత్యనారాయణ లాంటి నిర్మాత దొరకడం అదృష్టం అని రవితేజ తెలిపారు.
దేవిశ్రీ ప్రసాద్ తో చాలా గ్యాప్ వచ్చింది. అయినప్పటికీ ఈ చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ప్రతి సాంగ్ హిట్ అయింది. కిల్ కిల్ ఖిలాడీ అనే సాంగ్ తన ఫేవరెట్ అని రవితేజ తెలిపారు. ఇక ఈ చిత్రంలో అనసూయ, అర్జున్ గారితో తొలి సారి నటించా. చాలా కొత్తగా అనిపించింది.
ఇక రవితేజ హీరోయిన్ల గురించి మాట్లాడుతూ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ హీరోయిన్స్ ఇద్దరితో వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. డింపుల్ హయతి డాన్స్ చాలా బాగా చేస్తుంది అని తెలుసు. 'జరా జరా' సాంగ్ తో అది ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఆమె బాడీలో మంచి రిథమ్ ఉంది. బాడీలో రిథమ్ ఉన్న వాళ్ళు తప్పకుండా మంచి నటులు అవుతారు.
ఈ చిత్రంలో డింపుల్ పెర్ఫామెన్స్ చూస్తే ఆల్రెడీ 30 సినిమాల్లో నటించిన హీరోయిన్ లాగా అనిపిస్తుంది. ఇక మీనాక్షి.. అట్టా సూడకే సాంగ్ లో అదరగొట్టేసింది. మొదట ఆ అమ్మాయి సాఫ్ట్ అనుకున్నా.. కానీ చాలా అల్లరి అంటూ రవితేజ కామెంట్స్ చేశారు. వీళ్ళిద్దరూ తప్పకుండా పెద్ద స్టార్స్ అవుతారు అని రవితేజ విశ్వాసం వ్యక్తం చేశారు.
