మాస్ కాంబో రవితేజ-గోపీచంద్ మలినేని నాల్గో సినిమా గ్రాండ్ ఓపెనింగ్..
దసరాకి `టైగర్ నాగేశ్వరరావు`తో డిజాస్టర్ ని చవి చూసిన రవితేజ ఇప్పుడు మరో సినిమాని ప్రారంభించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న మూవీ గురువారం ప్రారంభమైంది.

రవితేజ, గోపీచంద్ మలినేనిలది టాలీవుడ్‌లో హిట్ కాంబినేషన్. ఇంకా చెప్పాలంటే ఊర మాస్ కాంబినేషన్. ఇప్పటి వరకు హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఇప్పుడు మరో హ్యాట్రిక్ కోసం రెడీ అవుతున్నారు. ఈ కాంబినేషన్‌లో నాల్గో సినిమా రాబోతుంది. బుధవారం ఈ సినిమాకి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూని ప్రకటించారు. నేడు గురువారం సినిమాని ప్రారంభించారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రం నేడు ప్రారంభమైంది. అతిథిగా వచ్చిన ప్రముఖ దర్శకుడు వినాయక్ రవితేజ, సెల్వ రాఘవన్, ఇందుజలపై క్లాప్ కొట్టారు. ఇందులో దర్శకుడు సెల్వరాఘవన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందుజ పవర్ ఫుల్ రోల్ చేస్తుందట. వీరితోపాటు థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జీకే విష్ణు కెమెరామెన్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, సాయి మాధవ్ బుర్రా రైటర్‌గా వర్క్ చేస్తున్నారు.
త్వరలోనే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాబోతుందట. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని సమాచారం. ఇక ఇటీవల దసరాకి `టైగర్ నాగేశ్వరరావు` చిత్రంతో సందడి చేశాడు రవితేజ. ఇందులో స్టూవర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు పాత్రలో కనిపించారు మాస్ రాజా. పాత్ర పరంగా ఆయన ఆకట్టుకున్నా, సినిమా మెప్పించలేకపోయింది. లెంన్త్ కారణంగా, బలమైన కాన్‌ఫ్లిక్స్ లేకపోవడం వల్ల సినిమా ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడి టేకింగ్ మైనస్. టెక్నీకల్‌గా బాగున్నా, కంటెంట్ పరంగా మెప్పించలేకపోయింది. పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. త్వరలో రవితేజ `ఈగల్` చిత్రంతో రాబోతున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీని సంక్రాంతికి తీసుకొచ్చే అవకాశం ఉందట.