టాలీవుడ్ లో ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా రవితేజకి ఉండే క్రేజ్ డిఫరెంట్ అని చెప్పాలి. సరైన కథలు తగలడం లేదు గాని మాస్ రాజాను దృష్టిలో ఉంచుకొని కథను అల్లితే ఆ కిక్కే వారు. రవితేజ బాక్స్ ఆఫీస్ హిట్ అందుకొని చాలా గ్యాప్ వచ్చింది. అయితే ఈ సారి మాత్రం తెరపై రవితేజ ఎనర్జీకి అందరూ షాక్ అవుతారని తెలుస్తోంది. 

డిస్కోరాజా కోసం రెండు డిఫరెంట్ షేడ్స్ లలో కనిపిస్తున్న మాస్ రాజా తన ఎనర్జితో బిగ్ స్క్రీన్ ని షేక్ చేయడం పక్కా అని టాక్ వస్తోంది. విఐ.ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న డిస్కో రాజా షూటింగ్ ఇప్పటికే 70% శాతం పూర్తయ్యింది. కిక్ సినిమాలో రవితేజ ఎనర్జీ ఎలా క్లిక్కయిందో అదే తరహాలో ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో మాస్ రాజా క్లిక్కవుతాడని చిత్ర యూనిట్ చెబుతోంది. 

ఎక్కడా తగ్గకుండా సినిమాను కాస్ట్లీగా తెరకెక్కిస్తున్నారు. సెకండ్ హాఫ్ లో సినిమా మరింత కొత్తగా ఉంటుందని రవితేజ సరికొత్త ఫిట్ నెస్ కూడా ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందట. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న చిత్ర యూనిట్ వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి టీజర్ ను రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసుకుంటోంది.