Asianet News TeluguAsianet News Telugu

రవితేజ `ధమాకా` ట్రైలర్‌కి డేట్‌ ఫిక్స్.. మాస్‌ జాతరకి రంగం సిద్ధం

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ `ధమాకా`. ఈ సినిమా త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు.

raviteja dhamaka movie trailer released date announced
Author
First Published Dec 11, 2022, 1:32 PM IST

మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `ధమాకా`. రవితేజ నుంచి వస్తోన్న పర్‌ఫెక్ట్ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెలలో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ రాబోతుంది. తాజాగా ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. ఈ నెల 15న(గురువారం) ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది యూనిట్‌. 

ఇప్పటికే ఈ చిత్రం నుంచి టీజర్‌, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా `జింతాక్‌`, `దండక డియాల్‌` పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. ఇవి యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అదిరిపోయింది. మాస్‌ ట్రాక్స్ మాస్‌ ఆడియెన్స్ లో పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. ఈ సినిమాతో భీమ్స్ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా నెక్ట్స్ లెవల్‌కి వెళ్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

ఇక ఇప్పుడు ట్రైలర్ కి కూడా రంగం సిద్ధమైంది. ఈ గురువారం గ్రాండ్‌గా రిలీజ్‌చేయబోతున్నారు. ఈ సందర్బంగా విడుదల చేసిన పోస్టర్‌ సైతం ఆకట్టుకుంటుంది. ఇందులో క్లాస్‌ అవతార్‌లో కనిపిస్తున్నారు. క్లాస్‌ మాస్‌ మేళవింపుగా ఉంది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సినిమా ప్రధానంగా యాక్షన్‌ నేపథ్యంలో సాగుతుందని, అయితే మాస్‌రాజా రావితేజ మార్క్ వినోదం పుష్కలంగా ఉంటుందని టీమ్‌ వెల్లడించింది. 

ఇందులో రవితేజకి జోడీగా శ్రీలీలా హీరోయిన్‌గా నటించింది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్ పతాకాలపై టీవీ విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్‌ 23న విడుదల కానుంది. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే అందించగా, కార్తీక్‌ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios