మాస్ మహారాజ రవితేజ హిరోగా వచ్చిన రాజా ది గ్రేట్ పాజిటివ్ టాక్ తో బాక్సాపస్ వద్ద సక్సెస్ సాధించిన రాజా ది గ్రేట్ రవితేజ కెరీర్ లోనే ది బెస్ట్ అనిపించిన నైజాం షేర్
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన రాజా ది గ్రేట్ సూపర్ డూపర్ కలక్షన్ లతో దూసుకుపోతోంది. ఈ చిత్రం మొదటి రోజు నుంచీ మంచి టాక్ తోనే నడిచింది. ఈ చిత్రం లో హీరో ఒక అమ్మాయిని సేవ్ చెయ్యడం కోసం సిద్దం అవుతాడు. పుట్టుకతో కళ్ళు లేకుండా పుట్టిన ఆ హీరో తన తల్లి చిన్నతనం నుంచీ ఇచ్చిన ట్రైనింగ్ సహాయం తో కళ్ళు ఉన్నవారికంటే తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటాడు.
ఓవర్ సీస్ తో సహా విడుదల అయిన ప్రతీ చోటా మంచి టాక్ ని సంపాదించుకున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పాతిక కోట్ల షేర్ ని సాధించింది. అయితే రవితేజ కెరీర్ లో మొట్టమొదటి సారిగా 10 కోట్ల షేర్ ని సాధించిన సినిమాగా నైజామ్ లో భారీ రికార్డు నెలకొల్పింది. నైజామ్ లో రవితేజ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రావడం ఇదే ఫస్ట్ టైమ్ అని అంటున్నారు. చాలా గ్యాప్ తరువాత రవితేజ చేసిన ఈ సినిమా, ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం విశేషమని చెప్పుకుంటున్నారు.
ఈ సినిమా సూపర్ సక్సెస్ లో ఫుల్ హ్యాపీగా ఉన్న రవి తదుపరి చిత్రం టచ్ చేసి చూడు షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక తమిళంలో విజయం సాధించిన 'బోగన్' సినిమా తెలుగు రీమేక్ లోను చేయడానికి ఆయన రెడీ అవుతున్నాడు.
