ప్రయోగాత్మక చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్న యాక్టర్ & డైరెక్టర్ రవిబాబు ఆవిరి అనే మరో థ్రిల్లర్ సినిమాను రెడీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు సమర్పకుడిగా ఉండడంతో సినిమా ఓ వర్గం ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తోంది.

కొన్ని రోజుల క్రితం సినిమాకు సంబందించిన ఒక స్పెషల్ లుక్ తో ఆకట్టుకున్న రవిబాబు ఇప్పుడు టీజర్ తో రెడీ అవుతున్నాడు. హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఆవిరి టీజర్ సిద్ధం చేసిన దర్శకుడు శనివారం ప్రేక్షకుల ముందుకు ఆ టీజర్ ని తీసుకురానున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఆవిరి మూవీ గ్రాండ్ గా విడుదల కానున్నట్లు రవిబాబు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు.

దిల్ రాజు ప్రొడక్షన్ లో మొదటి సారి ఎవరు ఊహించని విధంగా హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో మూవీ రానుండడం విశేషం.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ సినిమా ట్రైలర్ ను కూడా త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. చిత్ర యూనిట్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఆవిరి సినిమా అక్టోబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి వరుస అపజయాలతో సతమతమవుతున్న రవిబాబుకి ఆవిరి ఎలాంటి విజయాన్ని ఇస్తుందో చూడాలి.