గతంలోనూ మన తెలుగు హీరోలు తమ లుక్స్ తో చాలా ప్రయోగాలు చేసారు. అయితే అవి జస్ట్ ఓకే అనిపించుకున్నాయి. కానీ అంతగా తేడా కనిపించలేదు. కానీ రవితేజ మాత్రం ఎప్పుడూ తన లుక్స్ తో ప్రయోగాలు చేయలేదు. ఎలా ఉన్నాడో..అలాగే తెరపై కనిపిస్తూ వచ్చారు. అయితే ఈ మధ్యన ఆయనలో వృధ్ద ఛాయలు కనపడ్డాయి. ఆ తర్వాత మరీ సన్నబడి..ఏదో పేషెంట్ లా ఉన్నాడంటూ మాట్లాడే పరిస్దితి వచ్చింది.

అయితే తాజాగా ఆయన డిస్కో రాజా చిత్రం కోసం లైట్ గెడ్డంతో ఉన్న లుక్ మాత్రం అందరికీ షాక్ ఇస్తోంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిపోయింది. సినిమాలో ప్లాష్ బ్యాక్ లో ఈ లుక్ లో రవితేజ కనపడుతున్నాడంటున్నారు. ఏదైమైనా ఓ పాతికేళ్లు రవితేజ వెనక్కి వెళ్లిపోయినట్లు లేదూ.

 ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా , ఒక్క క్షణం ‘చిత్రాల దర్శకుడు వి .ఐ ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నేల టికెట్టు’ నిర్మాత రవి తాళ్లూరి నిర్మించనున్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రిభిన‌యం పోషించ‌నున్నాడ‌ట. అందులో ఒకటి కొడుకు పాత్ర కాగా మరొకటి తండ్రి పాత్ర అని తెలుస్తుంది . అయితే ముగ్గురు హీరోయిన్లుకు ప్రాధాన్యం వున్న ఈ చిత్రంలో ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నాబా నటేష్ ను మరొక హీరోయిన్ గా ఎంపిక చేశారు. మ‌రో హీరోయిన్‌గా ఆర్ఎక్స్ 100 భామ పాయ‌ల్‌ని ఎంపిక చేశారు.  

వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.  ఈ చిత్రం కొంత భాగం చెన్నై నేప‌థ్యంలో సాగనున్న‌నేప‌థ్యంలో త‌మిళ స్టార్ బాబీ సింహాని విలన్ గా ఎంపిక చేశార‌ని తెలుస్తుంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర ప్రీ లుక్ ఇటీవ‌ల విడుద‌లైంది. త్వ‌ర‌లో పూర్తి లుక్ విడుద‌ల చేస్తామ‌ని మేక‌ర్స్ అంటున్నారు.