Asianet News TeluguAsianet News Telugu

#Raviteja:కోతి పాత్రకి డబ్బింగ్ చెప్పిన ర‌వితేజ‌

ఈ చిత్రం  టీజ‌ర్, ట్రైల‌ర్‌, పాట‌లు ఈ సినిమాపై ఆస‌క్తిని పెంచేశాయి. ఇప్పుడు మ‌రో రవితేజ వాయిస్ మరో ఎట్రాక్షన్ చేరింది.  ఈ సినిమాలో కోటి అనే...

Ravi Teja voice over to Monkey jsp
Author
First Published Dec 27, 2023, 4:02 PM IST


రవితేజ వాయిస్ మొదటినుంచి కాస్త పెక్యులర్ గా ఉంటుంది. ఆ గొంతులో ఓ వెటకారం, ఫన్ మిళితమై ఉంటుంది. దాన్ని క్వారీ ఫార్వర్డ్ చేస్తూ ఆయనకు డైలాగులు రాస్తూంటారు. వాటితో హిట్స్ కొడుతూంటారు. ఆ వాయిస్ అంటే రాజమౌళికి కూడా ఇష్టం. అందులో   గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన   ‘మ‌ర్యాద రామ‌న్న‌’లో సైకిల్ పాత్ర‌కు ర‌వితేజ డ‌బ్బింగ్ చెప్పించారు. ర‌వితేజ చేసే ఫన్ తో  సైకిల్ కూడా సినిమాలో ఓ పాత్ర అయ్యిపోయింది. అలాగే మరోసారి వేరే పాత్రకు డబ్బింగ్ చెప్పబోతున్నారు. ఆ పాత్ర ఓ కోతి కావటం విశేషం. సైకిల్ కే తన వాయిస్ తో వెటకారం జతచేసి నవ్వించిన రవితేజ..ఇక కోతి పాత్ర అంటే మామూలుగా రెచ్చిపోతాడా... ఇంతకీ ఏ సినిమాకు అంటారా..  జ‌న‌వ‌రి 12న విడుదల కానున్న ‘హ‌నుమాన్‌’సినిమాకు అని తెలుస్తోంది.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రం హనుమాన్ (హను-మాన్) . ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పాన్ ఇండియా స్దాయిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 12వ తేదీన హనుమాన్‍ను రిలీజ్ చేయనున్నట్టు  మూవీ యూనిట్ చెబుతోంది. అయితే, పండగకు చాలా సినిమాలు పోటీలో ఉండటంతో హనుమాన్‍ను వాయిదా వేయాలని ఒత్తిడి వచ్చినట్టు తెలిసింది. అయితే, హనుమాన్‍ను అనుకున్న విధంగా జనవరి 12వ తేదీనే తీసుకురావాలని మూవీ యూనిట్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.  

ఇప్పటికే ఈ చిత్రం  టీజ‌ర్, ట్రైల‌ర్‌, పాట‌లు ఈ సినిమాపై ఆస‌క్తిని పెంచేశాయి. ఇప్పుడు మ‌రో రవితేజ వాయిస్ మరో ఎట్రాక్షన్ చేరింది.  ఈ సినిమాలో కోటి అనే కోతి  పాత్ర ఒక‌టి ఉంది. సినిమా అంత‌టా ఈ కోతి పాత్ర ఉంటుంది. ఈ పాత్ర‌కు ర‌వితేజ వాయిస్ ఓవ‌ర్ ఇవ్వటం హైలెట్ గా చెప్తున్నారు. ఈ పాత్ర‌, ర‌వితేజ గొంతులోని ఫన్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకొంటాయ‌ని చిత్ర‌ టీమ్   చెబుతోంది.ఇదే సీజ‌న్‌లో ర‌వితేజ ‘ఈగ‌ల్‌’ కూడా విడుద‌ల‌కు సిద్ధమైంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios