మార్చమని డైరక్టర్ ని బ్రతిమాలినా ఒప్పుకోవటం లేదా?! నిజమెంత
'టైగర్ నాగేశ్వరరావు' అనేది రవితేజ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. తెలుగుతో పాటుగా హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మొదటి పాన్ ఇండియా సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు.మరో నాలుగు రోజుల్లో ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ , మలయాళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం గ్లింప్స్, ట్రైలర్ అన్నిటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా అంతా బాగున్నా ఒకటే సమస్య గా భావిస్తున్నారట. అదేమిటంటే రన్ టైమ్ .
రీసెంట్ గా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి.. రన్ టైం ఏకంగా 3 : 0 : 39 సెకన్ల నిడివి కలిగి ఉంది. అంత ఎక్కువ రన్ టైం అంటే ప్రేక్షకులకి ఇబ్బంది పడటం ఖాయం అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారట. అందు నిమిత్తం దర్శకుడుని లెంగ్త్ తగ్గించి ట్రిమ్ చేయమని అడిగితే అందుకు ఒప్పుకోలేదని చెప్పుకుంటున్నారు.
ఇదే విషయాన్ని దర్శకుడు ప్రశ్నిస్తే...‘టైగర్ నాగేశ్వరరావు’ కథని చూపించాలంటే గట్టిగా 4 , 5 గంటల టైం పడుతుంది. రెండు భాగాలుగా ఈ కథని ప్లాన్ చేయాలని అనుకున్నాం. కానీ ఎక్కడ సగం సినిమా (Tiger Nageswara Rao) చూశామనే ఫీలింగ్ జనాలకి కలుగుతుందో అని భావించి 3 గంటల రన్ టైంని ఫిక్స్ చేయడం జరిగింది. గతంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ ‘మహానటి’ ‘రంగస్థలం’ వంటి చిత్రాలు కూడా 3 గంటల పైనే నిడివి కలిగి ఉంటాయి. కానీ అవి కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ‘టైగర్ నాగేశ్వరరావు’ కథ, విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి’ అంటూ చెప్పుకొచ్చారు.
ఇక రవితేజ ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’ ‘రావణాసుర’సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ‘రావణాసుర’ ప్లాప్ అయ్యింది. దాంతో తన నెక్స్ట్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు రవితేజ. రవితేజ నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ ఇది. అలాగే ‘కార్తికేయ 2’ ‘ది కశ్మీర్ ఫైల్స్’ వంటి పాన్ ఇండియా హిట్లు కొట్టిన అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రానికి నిర్మాత.వంశీ ఈ చిత్రానికి దర్శకుడు.టీజర్, ట్రైలర్ కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. కాబట్టి ‘టైగర్ నాగేశ్వరరావు’ పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పై అభిషేక్ అగర్వాల్, మయాంక్ సింఘానియా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే అక్టోబర్ 19న యూఎస్ ప్రీమియర్స్ కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.