ఇప్పుడు తెలుగులో ఫుల్ బిజీగా ఉన్న హీరో ఎవరంటే రవితేజ అని చెప్పాలి. అదేంటి వరస ఫ్లాఫ్ లు ఉన్నాయి కదా అయినా బిజీ ఎలా..హౌ అని ఆశ్చర్యపోకండి..అక్కడే ఉంది రవితేజ తెలివి అంతా. ఓ డైరక్టర్ కథ ఏ హీరోని ఉద్దేశించి రాసుకున్నా...డేట్స్ దొరక్కపోతే రవితేజ వైపు చూస్తారు. ఎందుకంటే రవితేజ తో బిజినెస్ ఈజీ. ఎక్కవ నస పెట్టరు. తన చుట్టూ తిప్పుకోరు. నచ్చితే నచ్చింది అని చెప్పి స్క్రిప్టు లాక్ చేసి ముందుకు వెళ్దాం అంటారు. లేదా ...ఇంకో సారి చూద్దాం అని మొహమాటం లేకుండా చెప్పేస్తారు. అది డైరక్టర్స్ కు,నిర్మాతలకు బాగా నచ్చే అంశం. మొహమాటానికి పోయి అసలు విషయం చెప్పకుండా తిప్పుకోవటానికి రవితేజ పూర్తిగా విరుద్దం అదే కలిసి వస్తోంది. 

నిజానికి అనీల్ రావిపూడి తో చేసిన `రాజా ది గ్రేట్‌` త‌ర‌వాత‌.. ర‌వితేజ‌ హిట్ మొహం చూడలేదు. ఆ సినిమాకు ముందు కూడా అదే పరిస్దితి. డిజాస్టర్స్ తో దూసుకుపోతున్నా అతని చేతిలో ఇప్పుడు ఐదు సినిమాలు ఉన్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన క్రాక్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అలాగే నేను లోకల్ దర్శకుడు న‌క్కిన త్రినాథ‌రావు తో ఓ సినిమా చేయాలి. ఆ సినిమా ఫన్నీ డిటెక్టివ్ కథ అని తెలుస్తోంది. అలాగే తనతో గతంలో సినిమా చేసి డిజాస్టర్ ఇచ్చిన  ర‌మేష్ వ‌ర్మ క‌థ ఓకే చేసుకున్నాడు. 

ఇక అల్లు అర్జున్ తో ఓ డిజాస్టర్ ఇచ్చి ఏ హీరో దొరక్క చూస్తున్న వ‌క్కంతం వంశీ ప్రాజెక్టు ఓకే చేసాడు. ఇవన్నీ చాలదన్నట్లు మ‌రో రీమేక్ రెడీ అవుతోంది.  ఇలా రవితేజ వరస సినిమాలు చేయటం వెనక స్ట్రాటజీ.. ఈ ఐదు ప్రాజెక్టులలో ఏది హిట్టైనా మళ్లీ ఫామ్ లోకి వచ్చేననే నమ్మకం. అలాగే ఎక్కువ టైమ్ తీసుకోకుండా వరస సినిమాలు చేసేసే రవితేజ స్పీడు. నిర్మాతలకు రవితేజ సినిమా అంటే డబ్బింగ్ రైట్స్ , శాటిలైట్ రైట్స్ బాగా పలుకుతాయనే నమ్మకం. దాంతో అందరూ రవితేజ వెనకే పడుతున్నారు. రవితేజ కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా ఛలో అంటున్నారు.