‘నేల టికెట్టు’ ట్విట్టర్ రివ్యూ..

ravi teja starrer nela ticket movie twitter review
Highlights

రవితేజ నుంచి మరో మాస్ మసాలా

మాస్ మహారాజ్ రవితేజ, మాళవిక శర్మ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ నేల టికెట్టు’ . రాజా ది గ్రేట్ తో హిట్ కొట్టిన రవితేజ.. టచ్ చేసి చూడుతో మళ్లీ రేసులో వెనకపడిపోయాడు. ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి
దర్శకత్వం వహించారు. మరి వీరిద్దరి కాంబినేషనల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘ నేల టికెట్టు’. ఈ సినిమాని వీక్షిస్తున్న కొందరు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. వారి ట్వీట్ల ప్రకారం సినిమా ఎలా ఉందో
తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు చూస్తుంటే.. ఈ సినిమా కూడా రవితేజకు తగ్గట్టుగా పక్కా మాస్ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పేరులోనే మాస్ కళ కొట్టొచ్చినట్టు కనపడుతోంది. సినిమా వీక్షిస్తున్న ప్రేక్షకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ‘ నేల టికెట్టు’ టైటిల్.. సినిమాకి బాగా సరిపోయిందంటూ
కొందరు ట్వీట్ చేస్తున్నారు.

మాస్ ప్రేక్షకులను మెప్పించేలా సీన్లు, డైలాగులు ఉన్నాయని కొందరు ట్వీట్ చేయగా.. హీరోని ఎలివేట్ చేయడం కోసం అవసరం లేని సీన్లు ఎక్కువగా పెట్టేశారని మరికొందరు ట్వీటుతున్నారు.  ఇక హీరోయిన్ మాళవికా శర్మ విషయానికి వస్తే.. ఈ సినిమాకి హీరోయిన్ పెద్ద ప్లస్ అని చెబుతున్నారు.

 హీరోయిన్  మాళవిక చూడటానికి హోమ్లీగా కనిపిస్తూనే.. పాటల్లో తన అందచందాలతో కనువిందు చేసిందని.. నటన పరంగానూ ప్రేక్షకులను ఆకట్టుకుందని చెబుతున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుందని.. ముఖ్యంగా జగపతిబాబు, రవితేజలు పోటీ పడి నటించారంటున్నారు. వీళ్ల మధ్య ఆధిపత్య పోరుతో సినిమా గ్రిప్పింగ్‌లోకి వెళ్లిందంటున్నారు. ఇక బ్రహ్మానంద, అలీ కామెడీ బాగా పండిందంటున్నారు. ఇక ఫిదా ఫేమ్ శక్తికాంత్ అందించిన పాటలు బాగున్నాయంటున్నారు. 

ఇక సినిమా హిట్టా, ఫట్టా తెలియాలంటే.. పూర్తి రివ్యూ కోసం ఎదురుచూడాల్సిందే. 
 

loader