Payal Item Song : రవితేజతో రచ్చ రచ్చ చేయబోతున్న పాయల్ రాజ్ పుత్
మాస్ మహారాజ్ రవితేజతో రెండో సారి ఆడిపాడబోతోంది.. రొమాంటిక్ స్టార్ పాయల్ రాజ్ పుత్. స్పెషల్ సాంగ్స్ తో టాలీవుడ్ లో హడావిడి చేస్తున్న పాయల్.. మాస్ మహారాజ్ తో రొమాన్స్ చేయబోతుంది.
టాలీవుడ్ లో అందాల సుందరి.. బ్యూటిఫుల్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్(Payal Rajput) కి యామా క్రేజ్ ఉంది. 'ఆర్ ఎక్స్ 100' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ సినిమాతో యూత్ ను బాగా ఆకట్టుకుంది. పస్ట్ మూవీతోనే సాలిడ్ గా అందాల విందు చూపించిన పాయల్.. ఆ తరువాత కూడా బోల్డ్ సీన్స్ తో యూత్ ను రెచ్చగొట్టింది. హీరోయిన్ గా కంటే కూడా.. స్పెషల్ అప్పీరియన్స్ కు.. స్పెషల్ సాంగ్స్ కు పాయల్ కేరాఫ్ అడ్రస్ గా మారింది.
అంతే కాదు వరుసగా ఐటమ్ సాంగ్స్ తో రచ్చ చేస్తున్న పాయల్.. బుల్ల రెడ్డి పాటతో ఇంకా ఫేమస్ అయ్యింది. ఒక వైపు హీరోయిన్ గా వచ్చే అవకాశాలు ఉపయోగించుకుంటూనే.. మరో వైపు వెబ్ సిరీస్ లు చేసుకుంటుంది. మరో వైపు హాట్ సాంగ్స్.. ఇంకో వైపు సోషల్ మీడియాలో అందాల విందు చూపిస్తోంది. సోషల్ మీడియా పేజ్ లో ఎప్పటికప్పుడు స్పైసీ పోస్ట్ లు పెడుతూ.. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇక ఈసారి మాస్ మహారాజ్ రవితేజతో రచ్చ చేయడానికి రెడీ అయ్యింది పాయల్.
ఈ సారి కూడా పాయల్ ఐటమ్ సాంగ్ తో హడావిడి చేయబోతున్నట్టు తెలుస్తుంది. 'ధమాకా' సినిమాలో రవితేజ (Raviteja )తో కలిసి ఒక ఐటమ్ లో చిందేయనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. గతంలోొ రవితేజతో కలిసి పాయల్ రాజ్ పుత్(Payal Rajput) డిస్కోరాజ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇపుడు ఐటమ్ సాంగ్ కోసం మరోసారి మాస్ మహారాజ్ తో స్క్రీన్ శేర్ చేసుకోబోతోంది. నక్కిన త్రినాథరావు(trinath rao nakkina) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రీసెంట్ గానే సెట్స్ పైకి వెళ్లింది. ఈసినిమాలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు రవితేజ.
Also Read : Samantha Special Song: ట్రోల్స్ చేస్తున్నా.. నవ్వుతూ స్పందించిన సమంత..
ఈ మూవీలో ఒక మాస్ నెంబర్ ని గట్టిగా ప్లాన్ చస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ పాటకు ముందుగా స్టార్ యాంకర్ అనసూయ(Anasuya )ను అనుకున్నారు. అనసూయ కూడా ఈ మధ్య సినిమాలలో గట్టిగానే ప్రతాపం చూపిస్తుంది. స్పెషల్ క్యారెక్టర్లు.. స్పెషల్ సాంగ్స్ తో అదరగొడుతుంది. ఈ సినిమాకు ముందు అనసూయ అనుకున్నా.. ఆ తరువాత ఏమైందో తెలియదు గాని.. ఈ మధ్య తెరపైకి పాయల్ పేరు తెరపైకి వచ్చింది.ఇక ఈ సినిమాలో రవితేజ్ కు జంటగా పెళ్ళి సందడి ఫేమ్ శ్రీలీల నటిస్తుంది.