రవితేజ రిజెక్ట్ చేసిన మూవీ..అదే కథతో ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టారు, పాపం ఆ డైరెక్టర్ కి ఛాన్స్ మిస్

టాలీవుడ్ లో కొన్నిసార్లు చిత్రాలు చేతులు మారుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి అగ్ర హీరోల విషయంలో ఇది చూశాం. కథలు నచ్చక రిజెక్ట్ చేయడం వల్లనో ఇతర కారణాల వల్లనో కొన్నిసార్లు హీరోలు తమకి వచ్చిన ఆఫర్స్ ని రిజెక్ట్ చేసేవారు.

Ravi Teja rejected this movie and Jr NTR gets block buster dtr

టాలీవుడ్ లో కొన్నిసార్లు చిత్రాలు చేతులు మారుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి అగ్ర హీరోల విషయంలో ఇది చూశాం. కథలు నచ్చక రిజెక్ట్ చేయడం వల్లనో ఇతర కారణాల వల్లనో కొన్నిసార్లు హీరోలు తమకి వచ్చిన ఆఫర్స్ ని రిజెక్ట్ చేసేవారు. దర్శకులు అదే కథలని మరో హీరో దగ్గరకి తీసుకెళ్లి వాళ్ళతో సినిమాలు చేసేవారు. అలా చాలా చిత్రాలు సూపర్ హిట్స్ అయిన సందర్భాలు ఉన్నాయి. 

చేతులు మారిన రవితేజ, ఎన్టీఆర్ చిత్రాలు 

'అతడు' చిత్రాన్ని పవన్ కళ్యాణ్ చేయాల్సింది..పవన్ రిజెక్ట్ చేయడంతో మహేష్ బాబు హిట్ కొట్టారు. భద్ర చిత్రాన్ని ఎన్టీఆర్ చేయాల్సింది.. కానీ రవితేజ సూపర్ హిట్ అందుకున్నారు. ఎన్టీఆర్, రవితేజ విషయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ చేయాల్సిన భద్ర చిత్రం రవితేజ చేతుల్లోకి వెళ్ళింది. రవితేజ చేయాల్సిన మరో సూపర్ హిట్ మూవీ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్ళింది. ఈ విషయాన్ని దర్శకుడు మెహర్ రమేష్ రివీల్ చేశారు. 

Ravi Teja rejected this movie and Jr NTR gets block buster dtr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రం టెంపర్. వక్కంతం వంశీ ముందుగా ఈ కథని రవితేజని దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారట. అంతకు ముందు వీళ్లిద్దరి కాంబినేషన్ లో కిక్ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. కిక్ చిత్రానికి కథ అందించింది వక్కంతం వంశీనే. అదే విధంగా టెంపర్ చిత్ర కథ కూడా రాశారు. టెంపర్ కథకి రవితేజ ఎనెర్జిటిక్ పెర్ఫామెన్స్ బావుంటుందని భావించారు. దర్శకుడిగా మెహర్ రమేష్ ని అనుకున్నారు. రవితేజకి కథ చెబితే ఆయనకి నచ్చలేదట. దీనితో రవితేజ రిజెక్ట్ చేశారు. ఒక వేళ రవితేజ ఈ కథని ఓకె చేసి ఉంటే మెహర్ రమేష్ కి ఒక హిట్ దక్కేదేమో. పాపం ఛాన్స్ మిస్ అయింది. 

టెంపర్ లో ఎన్టీఆర్ నట విశ్వరూపం 

ఆ తర్వాత ఈ కథ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్ళింది. ఎన్టీఆర్.. ఈ చిత్రం డైరెక్ట్ చేయడానికి పూరి జగన్నాధ్ అయితే బావుంటుంది అని ఆయన్ని ఎంపిక చేసుకున్నారు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో నట విశ్వరూపం ప్రదర్శించాడు. బ్యాడ్ కాప్ గా నటిస్తూనే క్లైమాక్స్ లో ఎన్టీఆర్ నటన నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. ఈ చిత్రం చేతులు మారడం వల్ల నష్టపోయింది ప్రధానంగా మెహర్ రమేష్ అని చెప్పొచ్చు. 

మెహర్ రమేష్ కి చెప్పుకోదగ్గ చిత్రం అదొక్కటే 

మెహర్ రమేష్ కి బిల్లా తప్ప చెప్పుకోదగ్గ హిట్ లేదు. అన్ని చిత్రాలు విమర్శలు మూటగట్టుకున్న డిజాస్టర్స్ అయ్యాయి. ఎన్టీఆర్ తో మెహర్ రమేష్ శక్తి అనే డిజాస్టర్ మూవీలో నటించారు. టెంపర్ చిత్రానికి దర్శకుడిగా మెహర్ ని తీసుకోకపోవడానికి కారణం ఇదేనేమో. మెహర్ రమేష్ దర్శకత్వం బాగానే చేస్తారు అనే పేరు ఉంది. కానీ కథల ఎంపికలో ఆయన చాలా పూర్. 

దేవర చిత్రానికి భారీ వసూళ్లు 

ఎన్టీఆర్ తన కెరీర్ లో దిల్, భద్ర, ఊపిరి లాంటి సూపర్ హిట్ చిత్రాలు రిజెక్ట్ చేశారు. ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర చిత్రంతో పాన్ ఇండియా హిట్ కొట్టారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సముద్రం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాగా తెరెకెక్కింది. 300 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఎన్టీఆర్ తదుపరి వార్ 2లో హృతిక్ రోషన్ తో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఇది భారీ మల్టీస్టారర్ చిత్రం. అదే విధంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చిత్రం కూడా ఇటీవల ప్రారంభం అయింది. మరి దేవర 2 ఎప్పుడు పూర్తి చేస్తారో చూడాలి. సెకండ్ పార్ట్ కి లీడ్ గా దేవర 1 క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇచ్చారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అనిరుద్ సంగీతం అందించారు. 

Ravi Teja rejected this movie and Jr NTR gets block buster dtr

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చేసిన తొలి పాన్ ఇండియా ప్రయత్నం దేవర సక్సెస్ అయింది. దేవర చిత్రం యుఎస్ లో అయితే రికార్డు వసూళ్లు సాధిస్తోంది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 5 రోజుల్లో 178 కోట్ల షేర్ రాబట్టింది. టోటల్ గ్రాస్ 300 కోట్లు దాటింది. 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios