‘రావణాసుర’ ప్రీ రిలీజ్ బిజినెస్ ..టోటల్ థియేటర్స్ కౌంట్

రావణాసుర’ (Ravanasura) చిత్రాన్ని అభిషేక్ పిక్చ‌ర్స్, ఆర్‌టీ టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా రూపొందించారు. ఈ చిత్రం కోసం ర‌వితేజ తొలిసారి క్రిమిన‌ల్ లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. 

Ravi teja Ravanasura  WorldWide Pre Release Business


రవితేజ హీరోగా 'రావణాసుర' సినిమా రూపొందింది. ఈ సినిమాలో ఆయన క్రిమినల్ లాయర్ గా కనిపించనున్నారు. అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. అనూ ఇమ్మాన్యుయేల్ .. మేఘ ఆకాశ్ .. ఫరియా అబ్దుల్లా .. దక్ష నగార్కర్ .. పూజిత్ పొన్నాడ హీరోయిన్స్ గా అలరించనున్నారు. ఈ సినిమాలోని ఐదుగురు హీరోయిన్స్ లో మెయిన్ హీరోయిన్  ఎవరు? హీరో పాత్రకే నెగెటివ్ షేడ్స్ ఉంటే .. అసలు విలన్ ఎవరు? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ సందేహాలకు ఈ సినిమా మాత్రమే సమాధానం చెబుతుందనేది మేకర్స్  మాట. ఈ నెల 7వ తేదీన  అంటే రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు చూద్దాం.


తెలంగాణా - 07.00cr

రాయలసీమ -  03.00cr

ఆంధ్రా - 10.00cr

తెలుగు రెండు రాష్ట్రాల టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ -  20.00cr

కర్ణాటక
భారత్ లో మిగతా భాగాలు
ఓవర్ సీస్ కలిపి   -  02.20cr

వరల్డ్ వైడ్ టోటల్ థియేటర్  ప్రీ రిలీజ్ బిజినెస్ – 22.20cr
వరల్డ్ వైడ్ థియేటర్ బ్రేక్ ఈవెన్ - 23.00cr

రవితేజ గత చిత్రాల ప్రీ రిలీజ్  బిజినెస్ లు 
 
ధమాకా - 18.30cr
రామారావు ఆన్ డ్యూటీ - 17.20cr
ఖిలాడీ- 22.80cr
క్రాక్ - 17.00cr
డిస్కో రాజా - 19.20cr
  

ఇక రావ‌ణాసుర సినిమాను థియేట‌ర్స్‌లో భారీగానే విడుద‌ల చేస్తున్నారు నిర్మాత‌లు. నైజాంలో 235, సీడెడ్‌లో 165, ఆంధ్రాలో 300 థియేట‌ర్స్.. టోట‌ల్‌గా తెలుగు రాష్ట్రాల్లో 700 థియేట‌ర్స్‌లో మూవీ రిలీజ్ అవుతుంది. క‌ర్ణాట‌క ఏరియాలో 75, ఓవ‌ర్ సీస్‌లో 150 థియేట‌ర్స్‌లో రిలీజ్ అవుతుంది. అంటే ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే 925 థియేట‌ర్స్‌లో రావణాసుర సినిమా విడుద‌లవుతుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios