- Home
- Entertainment
- Tollywood: అలా సూర్యతో సినిమాను వదిలేసుకున్నా.. వాళ్ల టీం చేసిన పని అస్సలు నచ్చలేదు
Tollywood: అలా సూర్యతో సినిమాను వదిలేసుకున్నా.. వాళ్ల టీం చేసిన పని అస్సలు నచ్చలేదు
Tollywood: దర్శకుడు బండి సరోజ్ కుమార్ తన కెరీర్ ఆరంభంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో సినిమా చేసే అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆత్మగౌరవం, టెక్నికల్ క్రియేటివిటీ విషయంలో రాజీ పడలేక..

సూర్య సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నాను?
దర్శకుడు బండి సరోజ్ కుమార్ తనదైన శైలిలో సినిమాలు తీస్తూ టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆయన కెరీర్ ఆరంభంలో తమిళ స్టార్ హీరో సూర్యతో ఒక భారీ ప్రాజెక్ట్ చేసే అవకాశం వచ్చిందని, కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుంచి తప్పుకున్నానని ఆయన ఒక ఇంటర్వ్యూలో వివరించారు.
సూర్యతో పరిచయం, కథా చర్చలు
సరోజ్ కుమార్ మొదట సూర్యకు కథ చెప్పడానికి మద్రాసు వెళ్లారు. కెమెరామెన్ బాలసుబ్రహ్మణ్యం సహాయంతో సూర్య అపాయింట్‌మెంట్ లభించింది. సూర్యకు కథ విపరీతంగా నచ్చడంతో, తన సోదరుడు జ్ఞానవేల్ రాజా(స్టూడియో గ్రీన్) ఈ సినిమాను నిర్మిస్తారని సరోజ్ కుమార్‌కు తెలిపారు. దాదాపు 20-25 సార్లు సూర్యతో భేటీ అయి, కథా చర్చలు జరిపినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు.
నిర్మాతతో విభేదాలు
సూర్య ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక కండిషన్ పెట్టారు. సినిమా ప్రారంభించే ముందు ఒక ప్రోమో షూట్ చేయాలని, అది నచ్చితేనే సరోజ్ డైరెక్టర్‌గా కొనసాగుతారని, లేదంటే స్క్రిప్ట్ ఇచ్చేసి వెళ్ళిపోవాలని చెప్పారు. దీనికి సరోజ్ అంగీకరించినప్పటికీ, ప్రోమో బడ్జెట్ విషయంలో విభేదాలు తలెత్తాయి. సరోజ్ అడిగిన 2.25 లక్షల బడ్జెట్‌ను నిర్మాత నిరాకరించి, కేవలం 1 లక్షలోనే పూర్తి చేయాలని ఒత్తిడి చేశారు.
ఆత్మగౌరవం కోసం త్యాగం
టెక్నికల్ అంశాల్లో, క్రియేటివిటీ విషయంలో రాజీ పడటం ఇష్టం లేక, అలాగే కొత్త దర్శకుడు అనే చులకన భావంతో మాట్లాడటం సరోజ్ కుమార్‌కు నచ్చలేదు. షూటింగ్ సమయంలో కనీసం ఒక దర్శకుడికి ఇచ్చే కనీస మర్యాద కూడా లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆత్మగౌరవం కోసం సూర్య లాంటి స్టార్ హీరో సినిమాను కూడా వదులుకుని మీటింగ్ మధ్యలోనే వచ్చేసినట్లు ఆయన తెలిపారు.
దర్శకుడిగా తనదైన ముద్ర..
సూర్య ఈ విషయాన్ని ఒక పరీక్షగా పేర్కొన్నప్పటికీ, సరోజ్ కుమార్ తన నిర్ణయానికే కట్టుబడ్డారు. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో తనదైన బాటలో సాగాలని నిర్ణయించుకున్న ఆయన, నేడు దర్శకుడిగా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు.

