మాస్ మహారాజ రవితేజ నుంచి వరుస సినిమాలు రాబోతున్నాయి. వరుస పరాజయాలతో డీలా పడ్డ రవితేజ ప్రస్తుతం విభిన్నమైన కథలని ఎంచుకుంటున్నాడు. ఎలాగైనా పూర్వవైభవాన్ని పొందాలని భావిస్తున్నాడు. రవితేజ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం డిస్కో రాజా. విఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. డిసెంబర్ 20న ఈ చిత్రం విడుదల కాబోతోంది. 

రవితేజ తదుపరి చిత్రాల గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించే ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా మరో దర్శకుడికి కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. స్వామిరారా చిత్రంతో గుర్తింపు సొంతం చేసుకున్న సుధీర్ వర్మ ఇటీవల ఓ మాస్ కథని రవితేజకు వినిపించాడట. 

కథ నచ్చడంతో సుధీర్ వర్మతో సినిమా చేసేందుకు రవితేజ అంగీకరించినట్లు తెలుస్తోంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన రణరంగం చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఇక రవితేజతో తెరకెక్కించే చిత్రం ఎలా ఉండబోతోందో చూడాలి.