మాస్ మహారాజ్ రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం మిస్టర్ బచ్చన్. భాగ్యశ్రీ బోర్సే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. రవితేజ ని మరోసారి హరీష్ శంకర్ ఎనెర్జిటిక్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

మాస్ మహారాజ్ రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం మిస్టర్ బచ్చన్. భాగ్యశ్రీ బోర్సే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. రవితేజ ని మరోసారి హరీష్ శంకర్ ఎనెర్జిటిక్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆగష్టు 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. దీనితో నెమ్మదిగా ప్రచార కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఇటీవల పవర్ ఫుల్ టీజర్ రిలీజ్ చేశారు. 

తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. కొన్ని రోజుల క్రితం సాంగ్ ప్రోమో రిలీజ్ చేస్తేనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. హీరోయిన్ గ్లామర్ గురించి తెగ చర్చ జరిగింది. తాజాగా విడుదలైన లిరికల్ సాంగ్ లో భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ మాయ చేస్తోంది అనే చెప్పాలి. మిక్కీ జె మేయర్ ఈ చిత్రాన్ని సంగీతం అందిస్తున్నారు. 

మరోసారి మిక్కీ జె మేయర్ తన మెలోడీ మ్యాజిక్ చేసి చూపించారు. ప్రముఖ లిరిసిస్ట్ సాహితి ఈ పాటని రచించారు. రొమాంటిక్ గా సాగే ఈ పాటలో లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. సాకేత్, సమీరా భరద్వాజ్ గాత్రం వినసొంపుగా ఉంది. 

YouTube video player

ఈ సాంగ్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా కనిపిస్తోంది. ఇద్దరూ కలసి రొమాంటిక్ గా చేస్తున్న డ్యాన్స్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా భాగ్యశ్రీ బోర్సే బ్యాక్ పాకెట్ లో రవితేజ చేయి పెట్టి వేస్తున్న స్టెప్పు గురించే సోషల్ మీడియా మొత్తం చర్చించుకుంటున్నారు. మొత్తంగా మిస్టర్ బచ్చన్ నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్ సంగీత ప్రియులని మాయ చేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు.