సక్సెస్ రానీ.. రకపోనీ, ఫెయిల్యూర్స్ ఎన్ని ఎదురవనీ.. తగ్గేదేలే అంటున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. వరుసగా సినిమాలు సెట్స్ ఎక్కిస్తున్నాడు. హిట్ అయ్యేవి అవుతాయి.. పోయేవి పోతాయి అన్న కాన్సెప్ట్ తో ఉన్నట్టున్నాడు. కొత్తగా మరో దర్శకుడిని రంగంలోకి దింపబోతున్నాడు.
సక్సెస్ రానీ.. రకపోనీ, ఫెయిల్యూర్స్ ఎన్ని ఎదురవనీ.. తగ్గేదేలే అంటున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. వరుసగా సినిమాలు సెట్స్ ఎక్కిస్తున్నాడు. హిట్ అయ్యేవి అవుతాయి.. పోయేవి పోతాయి అన్న కాన్సెప్ట్ తో ఉన్నట్టున్నాడు. కొత్తగా మరో దర్శకుడిని రంగంలోకి దింపబోతున్నాడు.
ఒక హిట్టు రెండు ప్లాపులు అన్నట్టు సాగిపోతోంది మాస్ మహారాజ్ రవితేజ కెరీర్. క్రాక్ తరువాత రవితేజ నుంచి వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బిత్తరపోయాయి. ఈ రెండు సినిమాల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మాస్ ఆడియన్స్.. రవితేజ అభిమానులు నిరాశ చెందారు. తరువాత వరుసగా సినిమాలు సెట్స్ఎక్కిస్తున్నాడు రవితేజ. ఇప్పటికే ధమాకా షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తోంది.. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా రిలీజ్ కు ముస్తాబవుతోంది. ఈమూవీలో రవితేజ సరసన కుర్ర హీరోయిన్ శ్రీలీల అలరించనుంది.
ధమాకా తరువాత రవితేజ వరుసగా రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. ఈ రెండు సినిమాలు కూడా సెట్స్ పైనే ఉన్నాయి. ఆ తరువాత కూడా ఓ సినిమాను ఆయన ఆయన తాజాగా ఒకే చేశాడనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఆ సినిమా కోసం ఓ స్పెషల్ దర్శకుడు రంగంలోకి దిగబోతున్నాడట. అతను ఎవరో కాదు. కార్తీక్ ఘట్టమనేని. సినిమాటోగ్రఫర్ గా ఎడిటర్ గా అనుభవం ఉన్న కార్తీక్ గతంలో ఒక సినిమాతో డైరెక్టర్ గా తనను తాను ఫ్రూవ్ చేసుకున్నాడు.
కార్తీక్ ఘట్టమనేని 2015లో ఆయన నిఖిల్ హీరోగా సూర్య వర్సెస్ సూర్య సినిమాను రూపొందించాడు. అయితే ఆ సినిమా సక్సెస్ కాకపోయినా.. మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఇంత వరకూ ఎవరూ చేయని కాన్సెప్ట్ కావడంతో ఒక వర్గం ఆడియన్స్ ఆ సినిమాకు బాగాకనెక్ట్ అయ్యారు. అయితే ఆ సినిమా తరువాత కార్తిక్ లాంగ్ గ్యాప్ తీసుకునిచేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.
రవితేజ హీరోగా వచ్చిన డిస్కోరాజా సినిమాకి కార్తిక్ సినిమాటోగ్రఫర్ గా పనిచేశారు. ఆ టైమ్ లోనే వీరు ఒక సినిమా చేయాలని అనుకన్నారట. కథ రెడీ చేసుకుని ఆయనకు వినిపించడం కథ ఓకే అవ్వడం జరిగిపోయాయట. ఈ కథ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందనున్నట్టు సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై సినిమాను నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది.
