రాజా ది గ్రేట్ సినిమా అనంతరం గత ఏడాది టచ్ చేసి చూడు - నేల టిక్కెట్టు అలాగే అమర్ అక్బర్ ఆంటోని సినిమాలతో వరుస అపజయాలను ఎదుర్కొన్న రవితేజ సరికొత్త లుక్ తో షాకిచ్చాడు. అపజయాలు నేర్పిన పాఠాలో లేక సినిమా క్యారెక్టర్ కోసం మారాడో గాని మొత్తానికి ఫిట్ నెస్ తో ఆశ్చర్యపరిచాడు. 

గత సినిమాల్లో దాదాపు కాస్త సన్నగానే కనిపించి కాస్త నెగిటివ్ కామెంట్స్ ను ఎదుర్కొన్న ఆయన ఇప్పుడు అన్ని విమర్శలకు కౌంటర్ ఇచ్చేశాడని చెప్పవచ్చు. ప్రస్తుతం మాస్ రాజా డిస్కో రాజా సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో రవితేజ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించనున్నాడు. 

ఒక వృద్ధిడి పాత్రలో అలాగే కండలు తిరిగిన యువకుడిగా కనిపిస్తాడట. ఈ సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని ఇన్ని రోజులు రవితేజ జిమ్ లో వర్కౌట్స్ చేశాడు. న్యాచురల్ గా ఉన్న ఈ లుక్ ఫ్యాన్స్ కి పిచ్చ కిక్కిస్తోంది. మరి సినిమాలో ఇంకెంత కిక్కిస్తుందో..?