హాట్ టాపిక్: రవితేజ రిక్వెస్ట్...సరే అన్న అరవింద్

విడుదలైన దగ్గరనుండి క్రాక్ చిత్రం సూపర్బ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ చిత్రం 30 కోట్ల మార్క్ ను అవలీలగా దాటిన విషయం తెల్సిందే. ఇప్పటికే క్రాక్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తోంది.

Ravi Teja Krack s OTT release postponed by a week jsp

మాస్ మహారాజా రవితేజ నుండి వచ్చిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ క్రాక్. ఈ సినిమా జనవరి 9న విడుదలైన సంగతి తెల్సిందే. విడుదలైన దగ్గరనుండి క్రాక్ చిత్రం ఆగకుండా సూపర్బ్ కలెక్షన్స్ తో భాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ చిత్రం 30 కోట్ల మార్క్ దాటేసింది. అయితే ఈ సినిమాని ఆహాలో జనవరి 29న విడుదల చేయటానికి ప్లాన్ చేసారు. అయితే అలా చేస్తే ఖచ్చితంగా కలెక్షన్స్ కు పెద్ద దెబ్బ పడుతుంది. అయితే మొదట చేసుకున్న ఎగ్రిమెంట్ ప్రకారం ఆ డేట్ కు రిలీజ్ చెయ్యాల్సిందే. 

దాంతో రవితేజ సీన్ లోకి వచ్చి అల్లు అరవింద్ ని రిక్వెస్ట్ చేసారని తెలుస్తోంది. మరో వారం గ్రేస్ పీరియడ్ అడిగినట్లు సమాచారం. సరే అని అల్లు అరవింద్ ఒప్పుకోవటంతో ..  ఇప్పుడు ఓటీటి రిలీజ్ డేట్ విషయంలో చిన్న మార్పు చోటు చేసుకుంది. ఈ సినిమాని జనవరి 29న కాక ఈ సినిమాను ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నారు.   

 ఇక క్రాక్ సినిమాని 8.25 కోట్లు ఖర్చు పెట్టి ఆహా వారు రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అమేజాన్ ప్రైమ్ వారు సైతం ఈ సినిమా రైట్స్ కోసం భారీగా ఖర్చుపెట్టడానికి రెడీ అయ్యారు. అయితే ఆహా కు చెందిన అల్లు అరవింద్ దూకుడుగా ముందుకువెళ్లి  సొంతం చేసుకున్నట్లుగా ఈ రేటుకు ఫైనల్ చేసుకున్నారు. ఆహాలో రిలీజు అవుతున్న మొదటి పెద్ద సినిమా ఇదే కావటం విశేషం.

డాన్‌శీను, బ‌లుపు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, గోపిచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం `క్రాక్`. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించ‌గా స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మిశ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌ల‌లో న‌టించారు. ‌స‌ర‌స్వ‌తి ఫిలిం డివిజ‌న్ ప‌తాకంపై బి. మ‌ధు నిర్మించారు.  

డైరక్టర్ గోపిచంద్ మలినేని మాట్లాడుతూ... ‘‘తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాకోసం ఎదురు చూశారు. సరైన సమయానికి సరైన సినిమాగా ‘క్రాక్‌’ వచ్చింది. ఈ చిత్రంతో ఇప్పటిదాకా ఉన్న గందరగోళాలన్నీ ఒక్కసారిగా తొలగిపోయి... పరిశ్రమకి మళ్లీ ఊపొచ్చింది’’ అన్నారు గోపీచంద్‌ మలినేని. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios