Asianet News TeluguAsianet News Telugu

టీవీల్లోనూ “క్రాక్” ...కేక పెట్టించింది

రవితేజ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్‌’. శ్రుతి హాసన్‌  హీరోయిన్. ఇందులో రవితేజ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇందులో  వరలక్ష్మి శరత్‌కుమార్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. కేవలం 50 శాతం సీటింగ్ తో కూడా భారీ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరచడమే కాకుండా రవితేజ కు కూడా ఒక పర్ఫెక్ట్ కం బ్యాక్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత 'క్రాక్' సినిమా ఆహాలో స్ట్రీమ్ చేస్తే అక్కడా పెద్ద హిట్టైంది. స్ట్రీమ్ స్టార్ట్ అయిన కొద్ది గంటల్లో భారీ వ్యూస్‌తో దూసుకుపోయింది ‘క్రాక్’‌.
 
Ravi Teja Krack Rocks on Television jsp
Author
Hyderabad, First Published Mar 25, 2021, 5:28 PM IST

రవితేజ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్‌’. శ్రుతి హాసన్‌  హీరోయిన్. ఇందులో రవితేజ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇందులో  వరలక్ష్మి శరత్‌కుమార్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. కేవలం 50 శాతం సీటింగ్ తో కూడా భారీ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరచడమే కాకుండా రవితేజ కు కూడా ఒక పర్ఫెక్ట్ కం బ్యాక్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత 'క్రాక్' సినిమా ఆహాలో స్ట్రీమ్ చేస్తే అక్కడా పెద్ద హిట్టైంది. స్ట్రీమ్ స్టార్ట్ అయిన కొద్ది గంటల్లో భారీ వ్యూస్‌తో దూసుకుపోయింది ‘క్రాక్’‌.

లాక్‌ డౌన్ తరువాత థియేటర్లకు ఆడియన్స్‌ వస్తారా లేదా అన్న కన్య్ఫూజన్‌పై క్లారిటీ ఇచ్చిన సినిమా ‘క్రాకే’. ఈ సినిమాకు సూపర్ పాజిటివ్ టాక్ రావటంతో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు..ఆ తర్వాత డిజిటల్‌ వ్యూస్‌లోనూ ‘క్రాక్’… అదే జోష్ చూపించిందని ‘ఆహా’ టీమ్ చెప్పింది. ఇప్పుడు టీవీల్లోనూ అదే స్దాయిలో ఫెరఫార్మ్ చేసింది. మార్చి 14న స్టార్ మా లో వరల్డ్ ప్రీమియర్ వేసారు. 

 స్మాల్ స్క్రీన్ పై  కూడా  క్రాకింగ్ టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం..అదీ ఓటీటిలో రిలీజ్ అయ్యాక కూడా అనేది పెద్ద రికార్డ్ గా చెప్తున్నారు.  పోటీ ఉండి కూడా 11.7 టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ ను సాధించి సత్తా చాటింది.

మొత్తానికి మాత్రం ఈ చిత్రం సిల్వర్ స్క్రీన్ పైనే కాకుండా స్మాల్ స్క్రీన్ పై కూడా మంచి ఆదరణను అందుకుందని చెప్పాలి. మరి ఈ చిత్రానికి థమన్ ఎలెక్ట్రిఫయింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు సముథ్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ ల రోల్స్ మరో బిగ్ ఎస్సెట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.పోలీసాఫీసర్ రోల్‌లో కనిపించిన రవితేజ.. ఫుల్ టైం యాంగ్రీ పోలీస్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. కథను చక్కగా మలిచి అన్ని పాత్రలకు న్యాయం చేకూర్చిన మలినేని గోపిచంద్ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios