రవితేజ అతి జాగ్రత్త ?, మళ్లీ వాళ్లతోనే వరస పెట్టాడు
కొత్త దర్శకులతో ముందుకు వెళ్లటానికి కొద్ది కాలం ఫుల్ స్టాఫ్ పెడదామని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తనకు గతంలో హిట్ ఇచ్చిన దర్శకులను రిపీట్ చేస్తు...

మాస్ మాహారాజా రవితేజ దసరా కానుకగా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా మార్నింగ్ షో నుంచే ఫ్లాఫ్ టాక్ సొంతం చేసుకుంది. ఎన్నో ఆశలు, ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్న ఈ చిత్రం ఈ స్దాయిలో డిజాస్టర్ అవ్వటం, అదీ ప్యాన్ ఇండియా లీగ్ లోకి ఈ సినిమాతో ప్రవేశిద్దామనుకోవటం రవితేజను నిరాశలో ముంచెత్తిందని సమాచారం. దాంతో ఇప్పుడు కొత్త దర్శకులతో ముందుకు వెళ్లటానికి కొద్ది కాలం ఫుల్ స్టాఫ్ పెడదామని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తనకు గతంలో హిట్ ఇచ్చిన దర్శకులను రిపీట్ చేస్తు సినిమాలు మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్- మాస్ మహారాజా రవితేజ, మాస్ మేకర్ గోపీచంద్ మలినేని మరోసారి జతకట్టారు. గతంలోవ వీరిద్దరి కాంబోలో వచ్చిన డాన్ శీను, బలుపు క్రాక్ చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్స్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మ్యాసీ కాంబో- #RT4GM కోసం నాల్గవసారి కలిసి పని చేయనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీస్ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా.. పవర్ పుల్ కథతో రూపొందించనున్నారు. కొన్ని నెలల క్రితం పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
అలాగే హరీష్ శంకర్, అనీల్ రావిపూడిలతో కూడా చర్చలు జరిపి సినిమాలు చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. 2024 లో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మూడు సినిమాలు తనకు హిట్ ఇచ్చిన దర్శకులతో చేయబోతున్నట్లు వినికిడి. ఇలా హిట్ కాంబో రిపీట్ అయ్యితే టెర్రిఫిక్ రెస్పాన్స్ వస్తుందని బావిస్తున్నారు. త్వరలోనే బ్లాస్టింగ్ అప్‌డేట్‌ల వచ్చే అవకాసం ఉంది. వాటికోసం అభిమానులు సిద్ధంగా ఉండండి అంటున్నారు. ఈ చిత్రంలలో మునుపెన్నడూ చూడని పాత్రలలో రవితేజ నటించనున్నారు. ఇందులో సర్ప్రైజింగ్ స్టార్ కాస్ట్, టెక్నికల్ టీం పని చేయనున్నట్లు తెలుస్తోంది. ఏదైమైనా రవితేజ చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు.