Asianet News TeluguAsianet News Telugu

Ravi Teja : రేణు దేశాయ్ రోల్ కు రవితేజ ఫిదా.. ఆ రెండు సినిమాలను గుర్తుపెట్టుకొని మరీ..

మాస్ మహారాజా లేటెస్ట్ ఫిల్మ్  ‘టైగర్ నాగేశ్వర రావు’. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగుతోంది. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. రేణు దేశాయి రోల్ పై ప్రత్యేకంగా వ్యాఖ్యానించారు. 
 

Ravi Teja Interesting Comments at Tiger Nageswara Rao Pre Release event NSK
Author
First Published Oct 15, 2023, 10:52 PM IST

మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja)  `టైగర్‌ నాగేశ్వరరావు` (Tiger Nageswara Rao) తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ ను యూనిట్ జోరుగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఇవ్వాళ హైదరాబాద్ శిల్పా కళా వేదికలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. విజేయంద్ర ప్రసాద్, హరీశ్ శంకర్, తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై రవితేజ స్పీచ్ తో అదరగొట్టారు. 

సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. నిజజీవితంతో వస్తున్న చిత్రం కావడంతో పాటు ఆ ఏరియాకు సంబంధించి స్టంట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ లు వర్క్ చేయడం మరింత బెస్ట్ అవుట్ పుట్ ను అందించిందన్నారు. ట్రైన్ సీన్ ను పీటర్ హెన్స్ ను డిజైన్ చేశారన్నారు. ఇక నటి రేణు దేశాయి (Renu Desai) రీ ఎంట్రీ తన సినిమాతోనే అవుతుండటం పట్ల సంతోషించారు. ఆమె నటించిన పాత్ర.. రియల్ లైఫ్ లోని హేమలత లవణంకు దాదాపుగా సరిపోయిందని, ఫర్ఫెక్ట్ గా ఉందని చెప్పారు. ఆ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, రేణు దేశాయి ఆ పాత్రలో నటించడం మరింత ఆసక్తికరంగా మారిందన్నారు. ఇక రేణు దేశాయి 20 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తుండటం విశేషం. 

ఇక సినిమాను ఎంతో ప్రేమించే వ్యక్తిగా రవితేజ తన సినిమా రిలీజ్ సందర్భంగా కూడా ఇతర సినిమాలకూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. నా తమ్ముడు అనిల్ రావి పూడి, బాలయ్య సినిమా ‘భగవంత్ కేసరి’, అలాగే విజయ్ ‘లియో’ కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నానన్నారు. ఇక చివర్లో రవితేజ ‘జై సినిమా’ అంటూ నినదించడంతో అభిమానులు అరుపులతో హోరెత్తించారు. అలాగే సినిమాకు వర్క్ చేసిన టెక్నీషియన్లు, నటీనటులను ప్రశంసించారు. 

స్టువర్ట్ పురం గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వంశీ దర్శకుడు. బాలీవుడ్ నటి నుపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్ కథానాయికలు.  రేణు దేశాయ్‌ కీలక పాత్రలో నటిస్తుంది. మ్యూజిక్ సెన్సేషన్ జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. రవితేజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం అక్టోబర్ 20న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios