దిల్ రాజు బేనర్ లో రవితేజ నటిస్తున్న తాజా చిత్రం రాజా ది గ్రేట్ అనిల్ రావిపూడి దర్శకత్వం, మెహరీన్ పిర్జాదా హీరోయిన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం టీజర్ విడుదల
రవితేజ, మెహరీన్ జంటగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం 'రాజా ది గ్రేట్'. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో దిల్ రాజు సమర్ఫణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు దిల్‌రాజు శనివారం ప్రకటించారు.ఈ సినిమాలో 'రవితేజ' అంధుడిగా నటించనున్నాడు. మాస్ మహారాజా రవితేజను మునుపెన్నడూ లేనివిధంగా చూపించబోతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా కొత్త ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఇక రాజా కొత్త అవతారంలో వస్తున్నాడని అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.
