Asianet News TeluguAsianet News Telugu

Mr Bachchan : ‘మిస్టర్ బచ్చన్’ గా రవితేజ... ఇంట్రెస్టింగ్ గా మాస్ రీయూనియన్ టైటిల్ పోస్టర్..

హరీశ్ శంకర్ యమా స్పీడ్ మీద ఉన్నారు. రవితేజతో మొన్ననే సినిమాను అనౌన్స్ చేసి వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా మూవీకి సూపర్ టైటిల్ ను ప్రకటించారు. టైటిల్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. 

Ravi Teja Harish Shankar Movie title Mr Bachchan NSK
Author
First Published Dec 17, 2023, 11:12 AM IST

డాషింగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తన ఫేవరెట్ హీరో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)తో రీయూనియన్ అయ్యారు. గతంలో వీరి కాంబోలో షాక్, మిరపకాయ వంటి సినిమాలు వచ్చాయి. మిరపకాయ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. మూడోసారి వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయ్యింది. ఇటీవలనే Mass Reunion అంటూ అధికారికంగా ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. దాదాపు 12ఏళ్ల తర్వాత ఈ కాంబో రిపీట్‌ కాబోతుంది. రవితేజ వంటి మాస్‌, ఎనర్జీకి, హరీష్‌ మాస్‌ యాక్షన్‌ టేకింగ్‌ తోడైతే సినిమా నెక్ట్స్ లెవల్‌ ఉండబోతుందని చెప్పొచ్చు. ఇప్పుడు అలాంటి సినిమాకే రెడీ అవుతున్నారు. కాగా తాజాగా సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ను అందించారు. 

ఇప్పటికే హీరోయిన్ ను ప్రకటించిన యూనిట్ తాజాగా టైటిల్ పోస్టర్ ను విడుదల చేసింది. రవితేజ - హరీశ్ చిత్రానికి ‘మిస్టర్ బచ్చన్’ Mr Bachchan : నామ్ తో సునా  హోగా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. టైటిల్ చాలా క్రేజీగా ఉంది. పైగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) పేరుతో రవితేజ నటిస్తుండటం ఆసక్తికరంగా మారింది. కిక్, డాన్ శీను వంటి చిత్రాల్లో అమితాబ్ ను ఇమిటేట్ చేసి, ఆయన ఫ్యాన్ గా అభిమానులను అలరించిన  విషయంతెలిసిందే. ఒక తాజాగా అమితాబ్ బచ్చన్ పేరుతోనే నటిస్తుండటం ఆసక్తికరంగా మారింది. 

ప్రస్తుతం టైటిల్ పోస్టర్ ఆసక్తికరంగా మారింది. చేతక్ పై అమితాబ్  స్టైల్ లో కూర్చున్న మాస్ మహారాజా ఆకట్టుకుంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ లో అమితాబ్ ఫొటోను కూడా ఇచ్చారు. దీంతో రవితేజ అమితాబ్ కు వీరాభిమానిగా నటించబోతున్నారని అర్థమవుతోంది.ఇక అమితాబ్ బచ్చన్ పేరుతో ఉన్న పాత్రలో నటించడం గౌరవంగా భావిస్తున్నట్టు రవితేజ పేర్కొన్నారు. మొత్తంగా హరీశ్ శంకర్ రవితేజ సినిమాను కొద్దిరోజుల్లోనే పూర్తి చేసేలా కనిపిస్తున్నారు. ఊహించని విధంగా అప్డేట్స్ ను అందిస్తూ వస్తున్నారు. నిన్న హీరోయిన్ ను కూడా అనౌన్స్ చేశారు. క్లాస్ మహారాణి అంటూ.. యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ (Bhagyashri Borse)ను హీరోయిన్ గా పరిచయం చేశారు. నార్త్ కు చెందిన ఈ ముద్దుగుమ్మకు ఇదే మొదటి సినిమా అని తెలుస్తోంది. 
 
ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ట్రెండింగ్ లో ఉన్న టెక్నీషియన్లనే ఎంచుకున్నారు. షూట్ త్వరలో  ప్రారంభం కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ `ఈగల్‌`, గోపీచంద్‌ మలినేనితో RT4GM చిత్రాల్లో నటిస్తున్నారు.  మరో సినిమాకూ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తం నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios