Asianet News TeluguAsianet News Telugu

#EagleOTT: రవితేజ ‘ఈగల్’ ఓటీటీ డిటేల్స్...అఫీషియల్ ప్రకటన

 కెమెరామన్ టర్న్డ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన  ఈ చిత్రం ఓటిటి డిటేల్స్ అఫీషియల్ గా బయిటకు వచ్చాయి. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. 

Ravi Teja Eagle OTT Streaming Details are officially Out jsp
Author
First Published Feb 24, 2024, 6:20 AM IST

విషం మింగుతాను.. విశ్వం తిరుగుతాను.. ఊపిరి ఊదుతాను.. కాపలా అవుతాను.. విధ్వంసం నేను.. విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను.. అంటూ డైలాగులు ‘ఈగల్’ రెండు వారాల క్రితం థియేటర్స్ లోకి దిగాడు. ఖచ్చితంగా హిట్ కావాల్సిన టైమ్ లో వచ్చిన ఈ సినిమా అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. సినిమా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవటం, కంటెంట్ కూడా ఆకట్టుకునే స్దాయిలో లేకపోవటం వంటివి కలెక్షన్స్ ని బాగా దెబ్బ తీసాయి. అయితే కొన్ని ఎపిసోడ్స్ మాత్రం అద్బుతంగా తీసారని మాత్రం అనేది నిజం. దాంతో చాలా మంది ఈ చిత్రం థియేటర్ లో చూడనివాళ్లు ఓటిటి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు.  కెమెరామన్ టర్న్డ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన  ఈ చిత్రం ఓటిటి డిటేల్స్ అఫీషియల్ గా బయిటకు వచ్చాయి. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. 

  ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌ (ETV WIN) ‘ఈగల్‌’ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను (eagle movie ott platform) దక్కించుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర టీమ్ తో, ఈటీవీ విన్‌ కూడా పోస్టర్‌ను విడుదల చేశాయి. ఎప్పటినుంచి మూవీ ఓటిటిలోకి అందుబాటులోకి వస్తుందన్న విషయం మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికీ థియేటర్‌లో నడుస్తున్న  ఈ చిత్రం ఓటీటీలో రావడానికి ఇంకాస్త సమయం పట్టవచ్చు. రిలీజ్ డేట్  నుంచి కనీసం నాలుగైదు వారాల తర్వాత ‘ఈగల్‌’ను స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.  అంటే మార్చి 2 వ వారం నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాసం ఉంది. 

Ravi Teja Eagle OTT Streaming Details are officially Out jsp

స్టోరీ లైన్

ఢిల్లీలో పని చేసే జర్నలిస్ట్ నళిని రావు (అనుపమ) కి  రోజు  అనుకోకుండా ఒక ప్రత్యేకమైన కాటన్ క్లాత్ ని చూస్తుంది. ఆ క్లాత్ ని కొనేటప్పుడు ఆ  క్లాత్ ని తయారుచేసిన పత్తి పండించే ఊరికి సంబంధించిన ఒక ఇంట్రస్టింగ్ విషయం తెలుసుకుంటుంది.  అదేమిటంటే..ఆ అరుదైన క్లాత్ ని ప్రపంచానికి పరిచయం చేసి, అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మాయమయ్యాడని.  వెంటనే ఆమె తన వృత్తి ధర్మంగా...ఆ విషయంపై పేపర్లో ఓ ఆర్టికల్ రాస్తుంది. సాధారణంగా కాటన్ క్లాత్ గురించి రాస్తే ఎవరూ పట్టించుకోరు. కానీ చిత్రంగా ఇంటిలిజెన్స్ రంగంలోకి దిగి ఆ పత్రిక మొత్తాన్ని ఒకరోజు ప్రింటవకుండా అడ్డుకుంటుంది. ఆ వార్త వల్ల ఓ టాప్ సీక్రెట్ బయిటకు వెళ్తుందని కంగారుపడుతుంది. నళిని మరింత ముందుకు వెళ్లకుండా జాబ్ పోతుంది. అయితే నళిని ఊరుకుంటుందా...ఆ మిస్ అయ్యిన వ్యక్తి గురించి ఆరా తీయటం మొదలెడుతుంది. 

ఆ క్రమంలో ఆ మిస్సైన వ్యక్తి పేరు సహదేవ్ వర్మ (రవితేజ) అని తెలుస్తుంది. అతని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు  నళిని ఆంధ్రప్రదేశ్ మదనపల్లి తాలూకాలో ఉన్న తలకోన అటవీ ప్రాంతానికి వెళుతుంది. అక్కడ  సహదేవ్ (రవితేజ) చిత్తూరు జిల్లాలోని తలకోన ప్రాంతంలో ఒక గిరిజన ప్రాంతంలో ఫాం హౌస్ కట్టుకుని ఒక పత్తి ఫ్యాక్టరీని నడుపుతుండేవాడిని తెలుసుకుంది.  అక్కడ పండే అరుదైన పత్తిని రైతులు తీసుకొచ్చి ఇదే ఫ్యాక్టరీలో నేయడం ద్వారా జీవనం సాగిస్తుంటారు. మరో ప్రక్క  పైకి మామూలు వ్యక్తిలా కనిపించే సహదేవ్ కి బ్యాక్ స్టోరీ కూడా ఉంటుంది. అతడికి ‘ఈగల్’ అనే మరో కోడ్ నేమ్,లైఫ్  కూడా ఉంటుంది. ఆ ఈగల్ కోడ్ నేమ్ వెనక కథేంటి.. సహదేవ్ వర్మ పేరు చెప్తే ఇంటిలిజెన్స్ ఎందుకు ఉలిక్కి పడింది..  సహదేవ్ భార్య రచన(కావ్య)కి ఏమైంది?సహదేవ్ ఎలా మిస్సయ్యాడు.. ఆ ప్లాష్ బ్యాక్ ఏమిటి వంటి  విషయాలన్నీ తెర మీదే చూసి తెలుసుకోవాలి.

Follow Us:
Download App:
  • android
  • ios