Asianet News TeluguAsianet News Telugu

#Eagle: ‘ఈగల్’ OTT డీల్ ఇబ్బందులా? ,నిజమెంత

రవితేజకి నాన్ థియేట్రికల్ రూపంలో బడ్జెట్ మొత్తం రికవరీ అయ్యేది. కానీ గత ఏడాది రవితేజ నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు.

Ravi Teja Eagle OTT deal has not been locked yet jsp
Author
First Published Feb 14, 2024, 6:24 AM IST | Last Updated Feb 14, 2024, 6:24 AM IST


గత కొద్ది నెలలుగా ఓటిటి సమస్యలు మొదలయ్యాయి.  పెద్ద సినిమాలు సైతం ఓటిటి బిజినెస్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చిన్న సినిమాల సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఇక  రవితేజ నటించిన ‘ఈగల్’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13 న రిలీజ్ అవుతుంది అని ముందుగా ప్రకటించారు.  అయితే సంక్రాంతికి ఎక్కువ సినిమాలు ఉండటంతో సోలో రిలీజ్ డేట్ కోసం ‘ఈగల్’ తప్పుకుంది. ఫిబ్రవరి 9 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాకి ఓటీటీ బిజినెస్ అవ్వలేదు అనే టాక్ కొద్దిరోజుల క్రితం వినిపించింది. సంక్రాంతి టైంలో పోటీగా చాలా సినిమాలు ఉండటంతో ‘ఈగల్’ కి ఓటీటీ బిజినెస్ అవ్వలేదు అని అంతా అనుకున్నారు. దాంతో ఇప్పుడు సినిమా రిలీజ్ తర్వాత ఓటిటి బిజినెస్ కోసం డీల్స్  జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాకు అనుకున్న స్దాయిలో టాక్ రాకపోవటంతో ఓటిటిలో సమస్యలు ఎదురవుతున్నాయని ట్రేడ్ టాక్.

శాటిలైట్ బిజినెస్ ఆల్రెడీ డౌన్ గా ఉంది. దాంతో అందరి దృష్టీ ఓటిటి డీల్స్ మీదే ఉంది. దాంతో నిర్మాతలు సైతం ఈ సినిమాకు ఓటిటి డీల్ పైనే ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. నిర్మాతలు కనుక మంచి ఓటిటి డీల్ లాక్ చెయ్యకపోతే బాగా లాస్ వస్తుందంటున్నారు. అయితే ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’కు ఉన్న రెప్యుటేషన్ తో ,వరస ప్రాజెక్టుల ఉన్న కారణంతోనూ, రవితేజ  సినిమా కావటంతోనూ ఓటిటిలో లాభాలు తెచ్చే డీల్ అయ్యే అవకాసం ఉందంటున్నారు. వాస్తవానికి  రవితేజకి నాన్ థియేట్రికల్ రూపంలో బడ్జెట్ మొత్తం రికవరీ అయ్యేది. కానీ గత ఏడాది రవితేజ నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. ఇప్పుడీ సినిమాకు నామ మాత్రమైన టాక్ రావటంతో ఇబ్బందుల్లో పడింది. 
 
‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరించారు. గతంలో నిఖిల్ తో ‘సూర్య వర్సెస్ సూర్య’ అనే డిఫరెంట్ మూవీని తెరకెక్కించిన కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్..లు హీరోయిన్లుగా నటించగా నవదీప్ కీలక పాత్ర పోషించారు..!రవితేజ, అనుపమ, కావ్య థాపర్ లాంటి టాప్ యాక్టర్లు, బెస్ట్ టెక్నిషియన్స్‌తో రూపొందించారు. వారి రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమాను 70 కోట్ల రూపాయలతో నిర్మించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా రిలీజ్‌కు ముందు మంచి బజ్ క్రియేట్ చేయడంతో ఈ సినిమాను ఏపీ, నైజాంలో కలిపి 700 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios