రవితేజ మాస్ ని మిస్ చేయకుండానే ఈ ప్రయోగాన్ని విజయవంతంగా తెరకెక్కించామని నమ్మకంగా చెబుతున్నాడు. 

రవితేజ ఈ సంక్రాంతికి తన కొత్త సినిమా ఈగల్ తో మన ముందుకు వస్తున్నారు. కార్తికేయ 2 తో పాటు రవితేజ సినిమాలు ధమాకా, డిస్కో రాజా చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా చేసిన కార్తీక్.. దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ మూవీని డైరెక్ట్ చేసాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే అనుకున్న స్దాయిలో బజ్ మాత్రం క్రియేట్ కావటం లేదు. తాజాగా ఈ చిత్రం గురించిన ఓ వార్త ఈ సినిమావైపు చూసేలా చేస్తోంది. అదేమిటంటే...

ఈ చిత్రం కమల్ తమిళంలో చేసిన విరుమాండి చిత్రం టైప్ స్క్రీన్ ప్లే తో రాబోతోంది. అంటే సినిమా మొత్తం PoV నేరేషన్ లో సాగనుంది. PoV లో చెప్పే కధ కావటంతో దాంతో లాండ్ స్కేప్ లు, విజువల్స్ మారిపోతూంటాయి. ఈగల్ క్యారెక్టర్ల మధ్య పాయింట్ అఫ్ వ్యూ(చూసే దృక్పథం)ని అనూహ్యంగా మార్చడం ద్వారా ఒక సరికొత్త అనుభూతి దక్కుతుందని కార్తీక్ చెబుతున్నాడు. రవితేజ మాస్ ని మిస్ చేయకుండానే ఈ ప్రయోగాన్ని విజయవంతంగా తెరకెక్కించామని నమ్మకంగా చెబుతున్నాడు. 

విరుమాండి (పోతురాజు) సినిమా 2004లో కమల్ డైరెక్షన్ లో తమిళంలో తెరకెక్కింది. తెలుగులో పోతురాజుగా డబ్ అయింది. ఈ స్క్రీన్ ప్లే ని రోష్ మ్యాన్ ఎఫెక్ట్ స్క్రీన్ ప్లే అంటారు. అంటే ఒకే ఇన్సిడెంట్ ను మూడు పాత్రల్లో వేర్వేరు యాంగిల్స్ లో చూపిస్తారన్నమాట మేకర్స్. అలా ముగ్గురు పాయింటాఫ్ లో చూసిన ప్రేక్షకులకు ఏది నిజమో ఏది అబద్దమో అర్థం చేసుకునేందుకు పరీక్ష పెట్టడమే ఈ ఎఫెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం. మరి రవితేజ వంటి స్టార్ హీరోకు ఈ నేరేషన్ ఏమేరకు సెట్ అవుతుందో చూడాల్సి ఉంది. కమల్ పోతురాజు చిత్రం ప్రయోగం అనిపించుకుంది కానీ కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. 

ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ , కావ్య థాపర్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈగల్‌లో నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఈగల్‌ పోస్టర్లు, స్టైలిష్ లుక్‌, ట్రైలర్‌ అప్‌డేట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూ.. సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. విషం మింగుతాను.. విశ్వం తిరుగుతాను.. ఊపిరి ఊదుతాను.. కాపలా అవుతాను.. విధ్వంసం నేను.. విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను.. అంటూ ట్రైలర్‌లో మాస్‌ మహారాజా రవితేజ స్టైల్‌లో సాగుతున్న మార్క్‌ డైలాగ్స్‌ అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి Davzand మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు.