Asianet News TeluguAsianet News Telugu

కొత్త సినిమాలు కమిట్ కాని రవితేజ, షాకింగ్ రీజన్

లాడి తర్వాత రవితేజ ఏ సినిమా చేయబోతున్నారు అనేది అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే మూడు ప్రాజెక్టులు చర్చలు దశ పూర్తి చేసుకుని రవితేజ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాయి. మారుతి, నక్కిన త్రినాధరావు వంటి  డైరక్టర్స్ సైతం బౌండ్ స్క్రిప్టులు పట్టుకుని వెయిటింగ్. కానీ రవితేజ మాత్రం ఆ ప్రాజెక్టులు చేస్తానని కమిట్ కాలేదని తెలుస్తోంది. రవితేజ సైతం వెయిటింగ్ మోడ్ లోనే ఉన్నారు. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు..ఎందుకోసం వెయిట్ చేస్తున్నారు..తనకి ఆల్రెడీ కథలు డైరక్టర్స్ నచ్చలేదా..ఎక్కడుంది సమస్య
 

Ravi Teja doesnt want to commit to another film jsp
Author
Hyderabad, First Published Jan 6, 2021, 7:35 AM IST

రవితేజ మరోసారి పోలీసుగా నటించిన ‘క్రాక్‌’ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా పూర్తి కాకుండానే రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా ప్రారంభించారు. మొన్న న్యూ ఇయిర్ కు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాడు. ఇప్పటికే ఆ చిత్రం యాభై శాతం పూర్తైంది. అయితే ఖిలాడి తర్వాత రవితేజ ఏ సినిమా చేయబోతున్నారు అనేది అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే మూడు ప్రాజెక్టులు చర్చలు దశ పూర్తి చేసుకుని రవితేజ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాయి. మారుతి, నక్కిన త్రినాధరావు వంటి  డైరక్టర్స్ సైతం బౌండ్ స్క్రిప్టులు పట్టుకుని వెయిటింగ్. కానీ రవితేజ మాత్రం ఆ ప్రాజెక్టులు చేస్తానని కమిట్ కాలేదని తెలుస్తోంది. రవితేజ సైతం వెయిటింగ్ మోడ్ లోనే ఉన్నారు. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు..ఎందుకోసం వెయిట్ చేస్తున్నారు..తనకి ఆల్రెడీ కథలు డైరక్టర్స్ నచ్చలేదా..ఎక్కడుంది సమస్య

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు..రవితేజ తన తాజా చిత్రం‘క్రాక్‌’ రిలీజ్ దాకా కొత్త సినిమా ఒప్పుకోకూడదనుకుంటున్నారు. అందుకు కారణం ఆ సినిమా రిజల్ట్ మేరకు తన భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది. ‘క్రాక్‌’ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యితే తను నెక్ట్స్ చేయబోయే సినిమాకు రెమ్యునేషన్ పెంచుతాడు. అలాగే బడ్జెట్ దగ్గరనుంచి అన్ని లెక్కలు మారుస్తాడు. అలా కాకుండా సినిమా తేడా కొడితే ఇప్పుడు తీసుకుంటున్న దాని ప్రకారమే ముందుకు వెళ్తాడు. అయితే కథల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది.  హిట్ అయితే వచ్చే ఇమేజ్, క్రేజ్ వేరు. అందుకు తగినట్లుగా మార్పులు చేయాలి. ఇవన్నీ అంచనా వేసుకునే రవితేజ ముందుకు వెళ్తున్నారు. 

ఇక ‘క్రాక్‌’ గురించి రవితేజ చెప్తూ...పక్కా కమర్షియల్ మూవీ. మాసీగా, ఫుల్‌ మీల్స్‌లా ఉంటుందనుకోండి. ప్రేక్షకులు సంతోషంగా చూస్తారు. వాళ్లకి కచ్చితంగా నచ్చుతుంది. సినిమా చాలా బాగొచ్చింది. నా పాత్రని కూడా చాలా బాగా ఆస్వాదించా. గోపీచంద్‌ మలినేనికీ, నాకూ బాగా సెట్‌ అయింది. అలా అని మేం ముందుగా అనుకుని ఈ సినిమా చేయలేదు. అలా కుదిరిందంతే. హ్యాట్రిక్‌ కొడతామని మేం నమ్ముతున్నాం. నా సినిమాలకి ఎలాంటి సంగీతం ఇవ్వాలో తమన్‌కి బాగా తెలుసు. తనకి నేనే కాదు, ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. సముద్రఖని నేను బాగా ఇష్టపడే అతి కొద్దిమంది వ్యక్తుల్లో ఒకరు. ఇదివరకు తన దర్శకత్వంలో పని చేయడాన్ని ఎంతగా ఆస్వాదించానో, తనతో కలిసి ఈ సినిమాలో నటించడాన్నీ ఆస్వాదించాను. శ్రుతి హాసన్‌ పాత్ర కూడా చాలా బాగుంటుంది అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios