Asianet News TeluguAsianet News Telugu

#Dhamaka:వైయస్ జగన్ పై రవితేజ 'ధమాకా' సెటైర్

ఈ సినిమాలో హైపర్ ఆది చెప్పన ఓ డైలాగు ఇప్పుడు వైజగన్ మీద వేసిన సెటైర్ గా ప్రచారం జరుగుతోంది.

Ravi Teja Dhamaka Satire On YS Jagan
Author
First Published Dec 24, 2022, 6:42 AM IST

మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల కంబినేషన్ లో వచ్చిన పక్క మాస్ ఎంటర్ ట్రైనర్ మూవీ ధమాకా. ఈ మూవీ నిన్న శుక్రవారం  వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి సందడి చేస్తోంది. క్రాక్ హిట్ తర్వాత వరుస ప్లాప్ లతో డీలా పడ్డ రవితేజ, ఈ మూవీ తో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడంటున్నారు.  ఈ మూవీ కూడా ఒక్కప్పటి రవితేజ మాస్ కామెడీ ని గుర్తు చేసాడంటున్నారు. అయితే అదే సమయంలో విమర్శలు వినిపిస్తున్నాయి. సినిమా బాగా రొటీన్ గా ఉందని, సెకండాఫ్ పూర్తి బోర్ కొట్టిందని చెప్తున్నారు.

 అభిమానులు మాత్రం వెంకీ , ఆంజనేయులు లాంటి సినిమాల తర్వాత ధమాకా అంటూ మరోసారి కామెడీ కమ్ యాక్షన్ తో రవితేజ మళ్ళీ కమ్ బ్యాక్ అయ్యాడంటున్నారు. ఏది ఎలా ఉన్నా ప్రస్తుతానికి అయితే కలెక్షన్స్ బాగున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే...ఈ సినిమాలో హైపర్ ఆది చెప్పన ఓ డైలాగు ఇప్పుడు వైజగన్ మీద వేసిన సెటైర్ గా ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాలో రావు రమేష్ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తూ హైపర్ ఆది ..సెటైర్స్ వేస్తూంటాడు. అలాగే ప్రీ ఇంటర్వెల్ లో ...హీరోని చంపేయమని రౌడీల గ్యాంగ్ లీడర్ లోడెత్తావా రమణకు  రావు రమేష్ పురమాయించి...  ఫోన్ కోసం ఎదురుచూస్తూంటాడు. అంతేకాదు మాటి మాటి కి ఫోన్ చేసి వేసారా లేదా వేసారా లేదా అని అడుగుతూంటాడు. అప్పుడు అది వింటూ ప్రక్కనే ఉన్న హైపర్ ఆది... “బాబోయ్ అప్పటినుంచి వేసారా లేదా వేసారా లేదా?  ఒకటో తారీకు వచ్చింది నా శాలరీ వేసారా లేదా?” అంటాడు. 

ఏపీలో గవర్నమెంట్ ఉద్యోగుల శాలరీలు ఫస్ట్ తారీఖుకు పడటం లేదని కొంతకాలంగా వినపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో  ఈ డైలాగు ప్రాధాన్యత సంతరించుకుంది. సోషల్ మీడియాలో దీన్ని హైలెట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. రవితేజ గత చిత్రాల్లో ఎప్పుడూ ఇలాంటి సెటైర్స్ లేకపోవటంతో కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ డైలాగు చెప్పిన హైపర్ ఆది...పవన్ కళ్యాణ్ కు,మెగా క్యాంప్ కు వీర భక్తుడు. రాజకీయంగా వైయస్ జగన్ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ పోరాడుతున్నారు. నిలదీస్తున్నారు..ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఈ డైలాగు అతని చేత చెప్పించాడంటున్నారు. అయితే రవితేజ సినిమాలో రావటంతో ఇది రవితేజ ఖాతాలో పడిపోయింది.   ఈ సినిమాకు కథ,మాటలు ఇచ్చిన బెజవాడ ప్రసన్న కుమార్ సైతం జబర్దస్త్ నుంచి రావటంతో ఆదితో పాటు చమ్మక్ చంద్ర, మచ్చ రవి ఇలా చాలా మంది జబర్దస్త్ ఆర్టిస్ట్ లు కపిస్తారు. 

Follow Us:
Download App:
  • android
  • ios