Asianet News TeluguAsianet News Telugu

#Dhamaka: ఓటీటీలో ‘ధమాకా’ సౌండ్ ఎలా ఉంది?!

  జనవరి 22 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండనుందని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించగా, అన్నట్లుగానే ఈ సినిమా నేటి తెల్లవారుజాము నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Ravi Teja Dhamaka movie ott result
Author
First Published Jan 22, 2023, 5:19 PM IST


ర‌వితేజ (Raviteja) ధ‌మాకా సినిమా ఓటీటీలోకి వ‌చ్చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం (నేటి) నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. డిసెంబ‌ర్ 23న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా నెల రోజులు కూడా పూర్తి కాకుండానే ఓటీటీలో విడుదలైంది. తెలుగు స్టేట్స్‌లో చాలా థియేట‌ర్ల‌లో ఈసినిమా ప్ర‌ద‌ర్శిస్తుండ‌గానే ఓటీటీలో రిలీజ్ కావ‌డం ఇంట్రస్టింగ్ గా మారింది. థియేటర్ లో సూపర్ హిట్టైన ఈ సినిమా ఓటిటిలో ఏ స్దాయి రిజల్ట్ వస్తుందనేది ఇండస్ట్రీ ఇంతా ఆసక్తికరంగా చూస్తోంది. అందుతున్న సమాచారం  మేరకు ...ఓటిటిలోనూ ఈ సినిమా దుమ్ము రేపే ట్రెండ్ కనపడుతోంది. సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్ట్ లు హల్ చల్ చేస్తున్నాయి.

ఇక  ‘ధమాకా’ బాక్సాఫీస్ వద్ద సర్‌ప్రైజింగ్ హిట్‌గా నిలిచి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కించగా, పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. రొటీన్ కథ అయినా, ఈ సినిమాలోని పాటలు,శ్రీలీల తో పాటు మాస్ అంశాలను ప్రేక్షకులను బాగా ఎంజాయ్ చేశారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లతో దుమ్ములేపింది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది. మరి థియేటర్లలో దుమ్ములేపిన ధమాకా, ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్‌ను అందుకుంటుందో చూడాలి. 

చిత్రం కథేమిటంటే...పీపుల్ మార్ట్ అధినేత చ‌క్ర‌వ‌ర్తి (స‌చిన్ ఖేడ్క‌ర్‌) తాను రెండు నెల‌ల్లో చ‌నిపోబోతున్న‌ట్లు ప్ర‌క‌టిస్తాడు. అత‌డి వ్యాపారాన్ని జేపీ (జ‌య‌రాం) అక్ర‌మంగా హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తాడు. అత‌డిని చ‌క్ర‌వ‌ర్తి త‌న‌యుడు ఆనంద్ చ‌క్ర‌వ‌ర్తితో (ర‌వితేజ‌) పాటు అత‌డి పోలిక‌ల‌తోనే ఉన్న నిరుద్యోగ యువ‌కుడు స్వామి (ర‌వితేజ‌)ఎలా ఎదుర్కొన్నార‌న్న‌ది ఈ సినిమా క‌థ‌. ఇందులో డ్యూయ‌ల్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో ర‌వితేజ న‌టించాడు. అత‌డి కామెడీ టైమింగ్‌, శ్రీలీల డ్యాన్సులు అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. ఈ ఔట్ అండ్ ఔట్
కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీలో రవితేజ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు సక్సెస్‌ను అందించింది.

Follow Us:
Download App:
  • android
  • ios