మాస్ మహారాజ్ తో స్టెప్పులేసిన శిల్పాశెట్టి, వైరల్ అవుతున్న వీడియో..
టాలీవుడ్ మాస్ మహారాజ్ తో కలిసి స్టెప్పులేసింది.. బాలీవుడ్ సీనియర్ బ్యూటీ శిల్పా శెట్టి.. ఇంతకీ వీరిద్దరు ఎక్కడ కలిశారు.. ఎందుకు డాన్స్ చేశారు.

తాజాగా మాస్ మహారాజ్ రవితేజతో కలిసి డాన్స్ వేసిన వీడియోను సోషల్ మీడియాలో శేర్ చేసుకుంది బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి. ఆమె బాలీవుడ్ లో ఇండియాస్ గాట్ టాలెంట్ షోకి జడ్జ్ గా ఉన్నారు. అయితే ఆమె చేసిన వీడియో ప్రకారం ఈ షోకి రవితేజ గెస్ట్ గా వచ్చినట్టు.. ఇది రవితేజ షోకు హాజరవుతుందని వెల్లడించింది. టైగర్ నాగేశ్వరరావు నుండి హిట్ పాట అయిన ఏక్ దమ్ సాంగ్ కు .. రవితేజతో కలిసి కాలు కదిపింది స్టార్ బ్యూటీ. ఇక స్టైలీష్ లుక్ లో రవితేజ.. ఎల్లో శారీలో శిల్పా శెట్టి.. తన స్టెప్పులతో పాటు, డిఫరెంట్ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ ను మంత్రముగ్దులను చేసింది. వీడియోతో పాటుగా హమ్ తో ఏక్ దమ్ ఫిదా హైన్. ఔర్ ఆప్ అంటూ ఓ క్యాప్షన్ కూడా జత చేసింది బ్యూటీ.
ఇక ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీ చేస్తున్నాడు. ఈమూవీతో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియాకు వెళ్లబోతున్నాడు. ఈనెల 20న మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. వంశీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-థ్రిల్లర్‌లో అనుపమ్ ఖేర్, జిషు సేన్‌గుప్తా, మరియు రేణు దేశాయ్ వంటి ప్రఖ్యాత నటీనటులు నటించారు మరియు నూపుర్ సనన్ హీరోయిన్ గా నటించింది. 1970 లో స్టువర్ట్ పురం గజదొంగగా పేరున్న టైగర్ నాగేశ్వరావు జీవితం ఆధారంగా ఈమూవీ రూపొందుతోంది. తాజాగా ఈమూవీ ట్రైలర్ రిలీజ్ అవ్వగా.. ట్రైలర్ తో అంచనాలు భారీగా పెంచారు టీమ్.
ఇక ఈమూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుండటంతో.. మూవీ ప్రనమోషన్లపై గట్టిగా దృష్టి పెట్టారు మూవీ టీమ్. అందులో భాగంగా.. బాలీవుడ్ లో ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. అందులో భాగంగానే ఇండియాస్ గాట్ టాలెంట్ 10లో వీరు సందడి చేసినట్టు తెలుస్తోంది. అటు బాలీవుడ్ లో రకరకరాల ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు టీమ్. మరి ఇంత కష్టపడుతున్నారు టైగర్ నాగేశ్వరావు టీమ్.. రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.