మాస్ మహారాజ్ రవితేజ సొంతంగా ఇండస్ట్రీలోకి వచ్చి ఎదిగిన వైనం అందరికి తెలుసు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన రవితేజ ఇప్పుడు మాస్ ప్రేక్షకులలో తిరుగులేని ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు.

Mr.ఇడియట్ గా వచ్చేస్తున్న రవితేజ తమ్ముడి కొడుకు 

మాస్ మహారాజ్ రవితేజ సొంతంగా ఇండస్ట్రీలోకి వచ్చి ఎదిగిన వైనం అందరికి తెలుసు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన రవితేజ ఇప్పుడు మాస్ ప్రేక్షకులలో తిరుగులేని ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. రవితేజకి ఇద్దరు సోదరులు. ఒక సోదరుడు భరత్ రోడ్డు ప్రమాదంలో కొన్నేళ్ల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. 

మరో సోదరుడు రఘు. రఘు కుమారుడు మాధవ్ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మాధవ్ హీరోగా న‌టిస్తోన్న‌ చిత్రానికి ‘Mr ఇడియ‌ట్‌’ అనే టైటిల్ ఖరారు. సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘పెళ్లి సందD’ చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. ఆదివారం ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌, ప్రీ లుక్‌ను మాస్ మ‌హారాజా ర‌వితేజ ఆవిష్క‌రించారు. నా కెరీర్‌లో ‘ఇడియ‌ట్’ సినిమాకు ఎంత ప్రాముఖ్య‌త ఉందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు మా ర‌ఘు కొడుకు మాధ‌వ్ ‘Mr ఇడియ‌ట్‌’ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. నాలాగే త‌న‌కు కూడా ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిల‌వాల‌ని కోరుకుంటున్నాను’’ అని టీమ్‌కి అభినంద‌న‌లు తెలియ‌జేశారు ర‌వితేజ‌.

Scroll to load tweet…

బేబీ నిర్మాత ఎస్ కె ఎన్ విరాళం 

ఎస్.కే.ఎన్ నిర్మించిన బేబీ చిత్రం జూలై 14న విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. సాయి రాజేష్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్‌లు ముఖ్య పాత్రలు పోషించారు.స్టేజ్ ఎక్కితే ప్రాసలు, పంచ్‌లతో ఆడియెన్స్‌ను అలరించే ఎస్.కే.ఎన్ తాజాగా మంచి మనసు చాటుకున్నారు. 

ఆయన తన తోటి స్నేహితుడి బిడ్డ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోంది. దీంతో పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ విరాళం కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో చలించిన ఎస్‌.కే.ఎన్ లక్ష రూపాయాల ఆర్థిక సాయాన్ని అందించారు. అంతే కాకుండా దాతలైవరైనా ఉంటే ముందుకు రావాలని కోరారు.'చిన్న పిల్లలు దేవుడితో సమానం.. ఈ బిడ్డ ప్రాణాంతాక వ్యాధితో బాధపడుతోంది.. నేను లక్ష రూపాయాల ఆర్థిక సాయాన్ని అందించాను.. నా స్నేహితులు, మా అభిమానులను కూడా తోచినంత విరాళాన్ని ఇవ్వాలని కోరుతున్నాను.. బిడ్డను ఆ దేవుడు చల్లగా ఆశీర్వదించాల'ని కోరుతూ ఎస్‌.కే.ఎన్ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

 సంగీత్ వేడుకలో మెగాస్టార్ మాస్ డ్యాన్స్ 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్. ఆగష్టు 11న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో నెమ్మదిగా ప్రమోషన్స్ జోరు పెరుగుతోంది. ఆయా మధ్యన విడుదలైన టీజర్, భోళా శంకర్ టైటిల్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా జామ్ జామ్ జజ్జనక అనే సంగీత్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో చిరు కీర్తి సురేష్, తమన్నాతో కలసి స్టెప్పులు అదరగొడుతున్నారు. కంప్లీట్ సాంగ్ ని జూలై 11న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 

Scroll to load tweet…

ముగిసిన రాంచరణ్ సెలవులు 

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఇటీవల తండ్రిగా ప్రమోషన్ పొందారు. ఉపాసన పండంటి పాపకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పాపకి క్లిన్ కార అని నామకరణం కూడా చేశారు. ఉపాసన గర్భవతి కావడంతో ఆమె బాగోగులు కోసం చరణ్ కొన్ని వారాలుగా షూటింగ్స్ కి దూరంగా ఉంటున్నాడు. ఇక చరణ్ సెలవులు ముగిసాయి. జూలై 11 నుంచి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం గేమ్ ఛేంజెర్ షూటింగ్ హైదరాబాద్ లో తిరిగి ప్రారంభం కానుంది.