ఇదేం ట్విస్ట్? : ఒకే కథతో రవితేజ, బెల్లంకొండ సినిమాలు
బెల్లంకొండ శ్రీనివాస్, రవితేజ ఇద్దరూ కూడా ఒకే కథతో సినిమాలు చేస్తున్నారని సమాచారం. ఈ మేరకు ఇద్దరూ కూడా ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేసారు.
ఒకే కథతో ఇద్దరు హీరోలు ఒకే సమయంలో సినిమా చేయటం అరుదుగా జరుగుతూంటుంది. ఎందుకంటే కోట్లతో నడిచే వ్యాపారం కాబట్టి ఇలాంటివి సాధ్యమైనంతవరకూ ఎవాయిడ్ చేస్తారు. కానీ ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్(Bellam Konda Sai Srinivas), రవితేజ(Raviteja) ఇద్దరూ కూడా ఒకే కథతో సినిమాలు చేస్తున్నారని సమాచారం. ఈ మేరకు ఇద్దరూ కూడా ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేసారు. స్టూవర్ట్ పురం దొంగ అయిన క్రిమినల్ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) కథ ఆధారంగా రెండు బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి.
Bellam Konda Sai Srinivas హీరోగా తెరకెక్కుతున్న చిత్రం టైటిల్ ‘స్టూవర్ట్ పురం దొంగ’(Stuartpuram Donga). ‘బయోపిక్ ఆఫ్ ఏ టైగర్’ అనేది ఈ సినిమా క్యాప్షన్. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా కోసం శ్రీనివాస్‌తో పాటు, హీరో రానా, రవితేజలను మేకర్స్ సంప్రదించారని సమాచారం. అయితే శ్రీనివాస్ ఈ సినిమాకు ఓకే చెప్పారట. ఆ మధ్యన శ్రీనివాస్ స్వయంగా ఈ సినిమా పోస్టర్‌ని విడుదల చేశారు. శ్రీ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
మరో ప్రక్క మాస్ మహరాజా రవితేజ కూడా ఇదే కథతో ప్యాన్ ఇండియా ఫిల్మ్ ప్రకటించాడు. వంశీ డైరెక్షన్‌లో ‘టైగర్ నాగేశ్వరరావు’(Tiger Nageswarao) బయోపిక్‌లో నటించడానికి కమిటయ్యాడు. ‘టైగర్ నాగేశ్వరరావు’ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ పాత్ర కోసం రవితేజ పూర్తిగా మేకోవర్ అవుతున్నాడు. తన బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్.. అన్నీ కొత్తగా, సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయని చెబుతున్నారు. అనౌన్స్‌మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఇంటరెస్టింగ్‌గా ఉండి వైరల్ అవుతోంది.
టైగర్ నాగేశ్వరరావు’ అనే టైటిల్‌తోనే తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ నిర్మించనుంది. 70, 80 దశకాల్లో ఆంధ్రా ప్రాంతంలో భారీ ఎత్తున దొంగతనాలు చేస్తూ జనాలకు నిద్ర లేని రాత్రులు మిగిల్చిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఇది.
ఇలా ఒకే కథతో రెండు సినిమాలు చేయటం ఇండస్ట్రీలో చిత్రంగా చెప్పుకుంటున్నారు. ఏ సినిమా హిట్ అవుతుంది,లేదా రెండు సినిమాలు హిట్ అవుతాయనా అనేది ప్రక్కన పెడితే అసలు మొదట రవితేజ తో బెల్లంకొండ చేద్దామనుకున్న ప్రాజెక్టు ఇప్పుడు రెండు ప్రాజెక్టులుగా ఎలా ప్రారంభమయ్యిందనేది ఇండస్ట్రీలో చర్చగా మారింది.
also read: Raviteja: గజదొంగ 'టైగర్ నాగేశ్వరరావు' గా రవితేజ ... పాన్ ఇండియా రిలీజ్!