మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) యాక్షన్ ట్రీట్ కు రెడీ అయ్యాడు. వరుసగా సినిమాలు తెరకెక్కిస్తున్న సీనియర్ హీరో.. ఈ సారి పక్కా స్కెచ్ తో సందడి చేయబోతున్నాడు.
మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) యాక్షన్ ట్రీట్ కు రెడీ అయ్యాడు. వరుసగా సినిమాలు తెరకెక్కిస్తున్న సీనియర్ హీరో.. ఈ సారి పక్కా స్కెచ్ తో సందడి చేయబోతున్నాడు.
వరుస సినిమాలతో మంచి ఊపు మీద ఉన్న మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja).. ఒక దాని వెంట మరొక సినిమా సెట్స్ ఎక్కిస్తున్నాడు. రీసెంట్ గా ఖీలాడి సినిమాతో పర్వాలేదు అనిపించిన రవితేజ (Ravi Teja).. ఆతరువాత లైన్ లో ఉన్న రామారావు ఆన్ డ్యూటీ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేశాడు. ఇకనెక్ట్స్ ప్రాజెక్ట్ గా ధమాకాను ఆల్ రెడి సెట్స్ ఎక్కించిన మాస్ మహారాజ్.. ఈసినిమాలో యాక్షన్ సీన్స్ కోసం రెడీ అవుతున్నాడు.
త్రీనాథ్ రావ్ నక్కిన డైరెక్షన్ లో రవితేజ (Ravi Teja) నటిస్తున్న సినిమా ధమాక. ఈ సినిమాలో పెళ్ళి సందడి ఫేమ్ శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో ఇద్దరు తారలు రవితేజ(Ravi Teja) తో కలిసి సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ లో భాగంగా హై యాక్షన్ సీన్స్ కోసం టాలీవుడ్ సూపర్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ లు రంగంలోకి దిగారు.
రామ్ లక్ష్మణ్ రంగంలోకి దిగితే ఆయాక్షన్ ట్రీట్ ఎలా ఉంటుందో అందరికి తెలుసు. ఇప్పటికే బాలయ్యకు అదిరిపోయే ఫైట్స్ ను క్రియేట్ చేసిన ఈ కవల యాక్షన్ కొరియో గ్రాఫర్లు రవితేజ కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈరోజు స్టార్ట్ అయిన యాక్షన్ ఎపిసోడ్స్ కు సంబంధించిన రామ్ లక్ష్మణ్ ఫోటోను మూవీ టీమ్ రిలీజ్ చేశారు.
భారీ సెట్ లో.. రవితేజ(Ravi Teja) కు సంబంధించిన హై యాక్షన్ సీన్ ను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. దీనిని రామ్ లక్ష్మణ్ లు పర్వావేక్షించారు. ఈ సినిమాకు ఎంతో కీలకమై ఫైట్ సీన్స్ ను కూడా చిత్రీకరించినట్టు సమాచారం. నిర్మాతలు కూడా బడ్టెట్ కు ఏమాత్రం వేనకాడకుండా ఈ సీన్స్ కోసం సహకరించారట. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగే ఈ సీన్స్ మాస్ ప్రేక్షకులకు మంచి విజ్యువల్ ఫీస్ట్ అవుతాయి అంటున్నారు ప్రొడ్యూసర్స్.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ధమాకా సినిమాకు భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. బెజవాడ ప్రసన్న కుమార్ ధమాక కు కథ, మాటలు అందిస్తున్నారు.
