డిఫరెంట్ ప్రయోగాత్మక చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవిబాబు మరో సినిమాతో సిద్దమయ్యాడు. అవును సీక్వెల్స్ తో మంచి సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు ఆ తరువాత పందిపిల్లతో ఒక ప్రయోగం చేశాడు. అదుగో అనే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది.

ఇక ఇప్పుడు ఆవిరి అనే మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో కొత్తగా ట్రై చేస్తున్నాడు. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరో టీజర్ ని రిలీజ్ చేసి సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశారు. ఒక చిన్న పాపకు సంబందించిన త్రిల్లింగ్ సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా ప్రజెంట్ చేసినట్లు తెలుస్తోంది.

ఆవిరి అనే కాన్సెప్ట్ తో రవిబాబు కొత్త భయాన్ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు లాంటి నిర్మాత సినిమా ప్రొడక్షన్ తో చేతులుకలిపారు అంటే సినిమాలో కొత్తదనం గట్టిగానే ఉన్నట్లు టాక్ వస్తోంది. మరి సినిమా రిలీజ్ అనంతరం ఎలాంటి టాక్ ని అందుకుంటుందో చూడాలి.