రవి మోహన్ కొత్త ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించినట్లు సోషల్ మీడియాలో అనౌన్స్ చేశాడు.

రవి మోహన్ సినీ ప్రయాణం

తమిళ ప్రముఖ నటుడు రవి మోహన్ 2003లో వచ్చిన ‘జయం’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ చిత్రమే తన ఇంటి పేరుగా మారింది. కొన్ని నెలల క్రితం తన పేరుని రవి మోహన్ గా మార్చుకున్నాడు. ‘జయం’ తర్వాత ‘ఎం.కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి’, ‘సంతోష్ సుబ్రమణ్యం’’, ‘నిమిర్ందు నిల్’, ‘తని ఒరువన్’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.

రవి మోహన్ నటిస్తున్న సినిమాలు

రవి మోహన్ ప్రస్తుతం ‘కరాటే బాబు’, ‘పరాశక్తి’ అనే రెండు సినిమాల్లో బిజీగా ఉన్నాడు. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ‘పరాశక్తి’ సినిమాలో రవి మోహన్ విలన్ గా నటిస్తున్నాడు. త్వరలోనే రవి మోహన్ నటించిన ‘జీనీ’ సినిమా విడుదల కానుంది. ఇంతే కాకుండా ఆయన నటించిన బ్లాక్ బస్టర్ ‘తని ఒరువన్’ సినిమాకి సీక్వెల్ లో కూడా నటించనున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.

రవి మోహన్ - ఆర్తి విడాకులు

ఇండస్ట్రీకి వచ్చి 23 ఏళ్ళు అయినా, మంచి కథలున్న సినిమాలే చేయాలనే ఉద్దేశంతో తక్కువ సినిమాల్లోనే నటించాడు రవి మోహన్. ఆయన సినిమాల్లో కొన్ని ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. ఇటీవల రవి మోహన్ వ్యక్తిగత జీవితంలో సమస్యలు మొదలైన సంగతి తెలిసిందే. తన భార్య ఆర్తితో విడిపోతున్నట్టు ప్రకటించాడు. ఆమె నుండి విడాకులు కోరుతూ కోర్టులో కేసు కూడా వేశాడు. రవి మోహన్ కి, సింగర్ కెనీషా కి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ వల్లే రవి మోహన్ - ఆర్తి విడిపోయారని అంటున్నారు.

యోగి బాబుతో సినిమా తీయనున్న రవి మోహన్

కొన్ని రోజుల క్రితం కెనీషాతో కలిసి ఒక పెళ్ళికి వెళ్ళిన రవి మోహన్ జంటగా కనిపించారు. దీని తర్వాత వివాదం మరింత ముదిరింది. చివరికి కోర్టుకి వెళ్ళిన రవి మోహన్, తన భార్య నుండి విడాకులు కోరాడు. పర్సనల్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ రవి మోహన్ ప్రొఫెషనల్ గా కొన్ని కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాడు. త్వరలోనే డైరెక్టర్ గా కూడా మారనున్నాడు. తన మొదటి సినిమాని యోగి బాబుతో తీయనున్నట్టు ఇటీవలే అనౌన్స్ చేశాడు.

ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన రవి మోహన్

ఇప్పుడు ప్రొడ్యూసర్ గా కూడా మారాడు రవి మోహన్. సోషల్ మీడియాలో తన కొత్త ప్రొడక్షన్ హౌస్ లోగో, పేరుని అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ‘రవి మోహన్ స్టూడియోస్’ అనే పేరుతో ప్రొడక్షన్ హౌస్ మొదలు పెట్టాడు. ఈ బ్యానర్ లో వరుసగా సినిమాలు తీయనున్నట్టు, ఆ చిత్రాలకు సంబంధించిన ప్రకటన త్వరలోనే ఉండబోతున్నట్లు తెలిపాడు. యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తున్న రవి మోహన్ కి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విషెస్ చెప్తున్నారు.

View post on Instagram