అల్లు అర్జున్ హీరోగా నటించిన 'రేసుగుర్రం' సినిమాలో విలన్ పాత్రలో నటించి అందరినీ మెప్పించాడు రవికిషన్. ఆ సినిమాలో మాదిరిగానే నిజజీవితంలో కూడా రాజకీయనాయకుడు కావాలనేది రవికిషన్  కల. 

అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 లోక్‌సభ ఎన్నికల్లో జౌన్‌పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో గెలవలేకపోయారు. అలానే పార్టీలో కూడా కంటిన్యూ అవ్వలేక 2017లో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. అప్పటినుండి పార్టీలో యాక్టివ్ గా ఉంటూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల్లో ఆయనకు ఎంపీ సీటు ఇచ్చింది బీజేపీ.  గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి రవి కిషన్ ఎంపీగా పోటీ చేస్తున్నారు.

ఇదే విషయాన్ని బీజేపీ సోమవారం నాడు ప్రకటించింది. బీజేపీ అందరికీ ఇష్టమైన పార్టీ అని.. బీజేపీ తరఫున పోటీ చేస్తే ఎవరైనా గెలిచి తీరతారని మీడియా ముందు రవికిషన్ అన్నారు.