జయాపజయాలతో సంబంధం లేకుండా డిఫరెంట్ సినిమాలతో  తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవిబాబు. గత కొంత కాలంగా ఆయన ఒక ప్రయోగాత్మకమైన చిత్రాన్ని తెరక్కిస్తున్నారు. పంది పిల్లను ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన అదుగో సినిమా ఫైనల్ గా రిలీజ్ కానుంది. 

ఈ సినిమా కోసం రవిబాబు చాలా సమయం తీసుకున్నారు. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ వర్క్స్ దృష్ట్యా రిలీజ్ డేట్ ను ఖచ్చితంగా చెప్పలేకపోయారు. ఇక ఫైనల్ గా అవుట్ ఫుట్ తో సంతృప్తి చెందిన రవిబాబు సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. నవంబర్ 7న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ సినిమాని నిర్మించారు. 

ఇకపోతే సినిమాలో బంటి అనే పంది పిల్ల పాత్ర ప్రధానమైనదని దర్శకుడు టీజర్ ట్రైలర్ లతోనే ముందే చెప్పేశాడు. ఇక రవిబాబు కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక నాభా నటేష్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.