పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'భవదీయుడు భగత్ సింగ్'. ఎందుకంటే ఈ చిత్రం హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'భవదీయుడు భగత్ సింగ్'. ఎందుకంటే ఈ చిత్రం హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. హరీష్ శంకర్ పవన్ ఫ్యాన్స్ ని ఎట్టి పరిస్థితుల్లో నిరాశపరచడు అని వారంతా హోప్స్ పెట్టుకుని ఉన్నారు. ఈసారి గబ్బర్ సింగ్ ని మించేలా కంటెంట్ తో రావాలని కోరుకుంటున్నారు. 

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఓ కొలిక్కి వస్తే.. భవదీయుడు భగత్ సింగ్ పట్టాలెక్కేస్తుంది. హరీష్ శంకర్ కూడా దానికోసం ఎదురుచూస్తున్నారు. ఈ లోపు మిగిలి ఉన్న ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. 

తాజాగా భవదీయుడు భగత్ సింగ్ గురించి క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో కేజీఎఫ్ 2 నటి రవీనా టాండన్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ రోల్ కోసం హరీష్ శంకర్.. రవీనా టాండన్ ని సంప్రదించారని.. పాత్ర నచ్చడంతో ఆమె ఓకె చెప్పిందని జోరుగా వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే కేజిఎఫ్ 2తో రవీనా టాండన్ పేరు మారుమోగుతోంది. ప్రధాన మంత్రి రమిక సేన్ పాత్రలో రవీనా అదరగొట్టేసింది. డిక్టేటర్ లేడీగా.. ఫియర్ లెస్ ప్రైమ్ మినిస్టర్ గా ఆమె నటన అద్భుతం అనే చెప్పాలి. 

రవీనా టాండన్.. తెలుగులో రధసారథి, బంగారు బుల్లోడు, ఆకాశ వీధిలో లాంటి చిత్రాల్లో నటించింది. తిరిగి ఆమె పవన్ కళ్యాణ్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తే ఫ్యాన్స్ కి అంతకు మించి ఇంకేం కావాలి. ఈ న్యూస్ నిజమైతే భవదీయుడు భగత్ సింగ్ చిత్రానికి అడిషనల్ ఫోర్స్ జత కూడినట్లే.