సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ మరణం తరువాత ఇండస్ట్రీలో చీకటి  కోణాలు తెరమీదకు వచ్చాయి. ముఖ్యంగా సినీ రంగంలో నెపోటిజం (వారసత్వం) కారణంగా కొత్తగా వచ్చే వారు ఎలా ఇబ్బంది పడుతున్నారో ప్రధానం చర్చకు వచ్చింది. ఈ నెపోటిజం కారణంగానే సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు తమకు గతంలో ఎదురైన అనుభవాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

తాజాగా బాలీవుడ్‌ సీనియర్‌ నటి రవీనా టండన్‌ కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయారు. బాలీవుడ్‌లో నటీనటులను దెబ్బతీసేందుకు కొంత మంది ఎదురుచూస్తుంటారని, తనకు కూడా అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. `ఓ సినిమాలో నటించేందకు నేను హీరోయిన్‌గా ఎంపిక అయ్యా. అంతా రెడీ అయ్యింది. ముహుర్తం కార్యక్రమానికి వెళ్లేందుకు రెడీ అవుతున్నా.. డిజైనర్స్‌ డ్రెస్‌ కూడా రెడీ చేశారు. అంతలోనే చిత్ర యూనిట్ నుంచి నన్ను తీసేసినట్టుగా కాల్ వచ్చింది.

దీంతో నేను షాక్‌కు గురయ్యా.. ఏం చేయాలో పాలుపోలేదు. ఆ తరువాత నాకు అసలు విషయం తెలిసింది. హీరో గర్ల్‌ ఫ్రెండ్‌కు నేను నచ్చలేదట, అందుకే నన్ను సినిమా నుంచి తొలగించారు. ఈ విషయం తెలియగానే నేను మరింత షాక్‌ అనిపించింది. ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారని నాకు అప్పుడే అర్థమైంది. దీంతో సర్ధుకొని ముందుకు పోవటం నేర్చుకున్నా అంటూ తన అనుభవాలను వ్యక్తం చేసింది.