బాలీవుడ్ నటి జైరా వాసిం ఇండస్ట్రీ నుండి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ పెట్టిన కాసేపటికే విషయం కాస్త వైరల్ అయింది. ఆమె సినిమాల నుండి తప్పుకోవడానికి గల కారణాన్ని మతంతో ముడిపెట్టి చెప్పడం పలువురిని అసహనానికి గురి చేసింది.

తాను కొనసాగుతున్న రంగం తన మాట విశ్వాసాలకు అడ్డుగా తగులుతోందని.. అందుకే సినిమాలకు దూరమవుతున్నానని చెప్పింది జైరా వాసిం. దీనిపై బాలీవుడ్ నటులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.

కొందరు జైరాని సపోర్ట్ చేస్తుంటే మరికొందరు మాత్రం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నటి రవీనా టాండన్.. జైరాఫై తన కోపాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ రూపంలో  షేర్ చేసింది.

రెండు సినిమాలకే సినిమా ఇండస్ట్రీపై ఇలాంటి నెగెటివ్ అభిప్రాయాన్ని పెంచుకునేవారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని రవీనా రాసుకొచ్చింది. ఇండస్ట్రీ అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఇండస్ట్రీ నచ్చకపోతే స్వచ్చందంగా తప్పుకోవచ్చని.. కానీ ఇలా ఇతరుల్లో చిత్ర పరిశ్రమపై తప్పుడు అభిప్రాయాలు కలిగే విధంగా కామెంట్స్ చేయకూడదని ట్విట్టర్ లో రాసుకొచ్చారు.