Asianet News TeluguAsianet News Telugu

జర్నలిస్ట్ పై రవీనా టాండన్ 100 కోట్ల పరువు నష్టం కేసు .. కారణం తెలిస్తే షాకే?

ఆ సమయంలో రవీనా తాగి ఉందని, కారు దిగి మహిళపై దాడి చేసిందని ఆరోపించాడు. కారు ఢీకొట్టిందని చెబుతున్న మహిళ మాత్రం.. రవీనా, ఆమె డ్రైవర్ తనపై దాడిచేశారని, ముక్కు నుంచి రక్తం కారుతోందని చెప్పింది.

Raveena Tandon Sends Defamation Notice, Demands Rs 100 Crore jsp
Author
First Published Jun 15, 2024, 9:56 AM IST

రవీనా టాండన్  గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు.  కేవలం బాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాకుండా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ  సంవత్సరాలుగా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది. రకరకాల  ప్రాజెక్ట్‌లలో భాగమైన ఈ నటి తన బ్యాక్ టు బ్యాక్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా ఆమె ఓ వివాదంలో ఇరుక్కుంది. ఈ విషయమై ఓ జర్నలిస్ట్ పై వంద కోట్లు పరువు నష్టం దావా వేయటానికి సిద్దమై నోటిసులు పంపింది. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ (Raveena Tandon), ఆమె డ్రైవర్‌పై దాడి ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం గుర్తుండే ఉండి ఉంటుంది. ‘మాపై దాడి చేయకండి’ అంటూ రిక్వెస్ట్  చేస్తున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది. రవీనా, ఆమె డ్రైవర్‌ మద్యం తాగి ఉన్నారని, ర్యాష్‌ డ్రైవింగ్‌కు పాల్పడ్డారని కొందరు వారిపై ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ముంబయి పోలీసులు (Mumbai Police) స్పష్టతనిచ్చారు. అది తప్పుడు కేసు అని, నటి మద్యం తాగలేదని వెల్లడించారు. 

అలాగే సీసీటీవీ ఫుటేజీ ప్రకారం ఆమె, కారు రోడ్డుపై ఎవరినీ ఢీకొట్టలేదని కేవలం ఫ్రేమ్ చేయబడిందని తేల్చారు. అయితే కొన్ని రోజుల క్రితం తనను తాను ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ గా చెప్పుకునే మోసిన్ షేక్ ... ఆ సమయంలో రవీనా ఆ  వీడియోలో తాగి ఉందని,  కోర్టు ధృవీకరించినప్పటికీ ఆమె తప్పును అంగీకరించలేదని ఆరోపించడం ప్రారంభించాడు. తరువాత, రవీనా ఈ విషయమై కోసం లీగల్ నోటీసును పంపారు . అంతేకాదు ఇప్పుడు  ఈ కేసును  లీగల్ టీమ్ ముందుకు తీసుకువెళ్తోంది. 100 కోట్లు పరువు నష్టం కేసు వేస్తున్నట్లుగా నోటీసులు పంపటం జరిగింది. ఆ నోటీస్ లో ఆధారాలు లేకుండా ఆమెపై ఆరోపణలు చేసి పరువు తీస్తున్నారని ఉంది. 
 .
 ఇక ఈ ఘటనపై   ముంబై పోలీసులు స్పందించారు. రవీనా కారు ఎవరినీ ఢీకొట్టనే లేదని తమ దర్యాప్తులో తేలినట్టు చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలో కారు ఆ మహిళ సమీపం నుంచి వెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. శనివారం రాత్రి బాంద్రాలోని కార్టర్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన తల్లి, సోదరితో కలిసి రవీనా ఇంటి సమీపంలో వాకింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. కారు తగిలిందంటూ తొలుత డ్రైవర్‌తో వాగ్వివాదానికి దిగిన మహిళ కుమారుడు.. ఆపై స్థానికులతో కలిసి దాడిచేశాడు. ఈ క్రమంలో రవీనాపైనా దాడి జరిగింది. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.
 
గొడవ జరగడంతో మాట్లాడేందుకు కారు దిగిన రవీనా ‘దయచేసి నన్ను కొట్టొద్దు’ అని చెప్పడం వైరల్ అవుతున్న వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. అయినప్పటికీ వినిపించుకోని స్థానికులు ఆమెను చెయ్యిపట్టి లాగి దాడిచేశారు. గుంపులోని ఓ వ్యక్తి గట్టిగా అరుస్తూ.. రవీనా డ్రైవర్ ఆమె తల్లిని ఢీకొట్టాడని, ప్రశ్నిస్తే దాడిచేశాడని చెప్పడం వినిపించింది. అంతేకాదు, ‘మారో.. మారో’ అని రెచ్చగొట్టాడు. ఆ సమయంలో రవీనా తాగి ఉందని, కారు దిగి మహిళపై దాడి చేసిందని ఆరోపించాడు. కారు ఢీకొట్టిందని చెబుతున్న మహిళ మాత్రం.. రవీనా, ఆమె డ్రైవర్ తనపై దాడిచేశారని, ముక్కు నుంచి రక్తం కారుతోందని చెప్పింది.

ఈ ఘటనపై డీసీపీ రాజ్‌ తిలక్ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుడు తప్పుగా ఫిర్యాదు చేశాడని తెలిపారు. తాము మొత్తం సీసీటీవీ ఫుటేజీని చెక్ చేశామని, కారు ఢీకొట్టినట్టు ఎక్కడా లేదని తెలిపారు. డ్రైవర్ కారు రివర్స్ చేస్తుండగా అదే సమయంలో ఆ కుటుంబం రోడ్డు దాటుతోందని పేర్కొన్నారు. కారును ఆపిన కుటుంబం తమను ఢీకొట్టావంటూ డ్రైవర్‌తో వాగ్వివాదానికి దిగిందని వివరించారు. అలా గొడవ మొదలైందని తెలిపారు. ఈ తర్వాత రవీనా టాండన్, ఆరోపిత కుటుంబ సభ్యులు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారని, అయితే ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయవద్దని కోరుతూ లెటర్లు ఇచ్చారని డీసీపీ వివరించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios