బాలయ్య సరసన ‘బంగారు బుల్లోడు’లో నటించిన రవీనా టండన్ గుర్తుందా.. ఒకప్పడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన రవీనా టండన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. అయిన్నప్పటికీ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన విశేషాలు తమ అభిమానులకు తెలియ చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతున్న వీడియోలను, ఫొటోలను ఆమె షేర్ చేస్తుంటారు. 

తాజాగా రవీనా తన కుమార్తెలకు సెల్ప్ డిఫెన్స్  కోసం భాక్సింగ్  నేర్పిస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను రవీనా సోషల్ మీడియాలో పోస్టు చేస్తే ఇప్పుడా వీడియో వైరల్ అయ్యింది. రవీనా కుమార్తె రషా ప్రస్తుతం బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటోంది. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు. 

ఇక రవీనా టండన్ 2003లో అనిల్ థడానీని వివాహం చేసుకున్నారు.  పెళ్లి తర్వాత చాలా తక్కువ సినిమాల్లో నటించింది. కెరీర్ కంటే ఇల్లు, పిల్లలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఎప్పుడో ఓసారి సినిమాల్లో చేస్తోంది.  డిస్ట్రిబ్యూటర్ థదానీని పెళ్లి చేసుకున్నాక పెహచాన్: ద ఫేస్ ఆఫ్ ట్రూత్, శాండ్‌విచ్, బుడ్డా హోగా తేరే బాప్, శోభనా 7 నైట్స్ వంటి కొన్ని సినిమాల్లో మాత్రమే రవీనా కనిపించింది. అయితే ఇవేవీ కూడా పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయాయి.

పెళ్లికి ముందు రవీనా సక్సెస్‌ఫుల్ నటిగా నిరూపించుకుంది. అందాజ్ అప్నా అప్నా, చోటేమియా బడే మియా, ఘర్‌వాలీ-బాహర్‌వాలీ, ఆంటీ నంబర్ 1, బాంబే వెల్వెట్ వంటి చిత్రాలు రవీనాకు మంచి పేరే తెచ్చాయి. తెలుగులో ఆమె నటించిన బంగారు బుల్లోడు మంచి వసూళ్లనే రాబట్టింది. రవీనా టండన్ తెలుగులో  ‘బంగారు బుల్లోడు’తో పాటు.. ‘ఆకాశ వీధిలో’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ తదితర చిత్రాలలోనూ నటించారు.