`కేజీఎఫ్`కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇటీవలె క్లైమాక్స్ సన్నివేశాలను భారీగా షూట్ చేసారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ పవర్‌ఫుల్ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.   

కన్నడ స్టార్ హీరో యష్ ‘కేజీఎఫ్’ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. ఈ ఒక్క సినిమాతో యష్ కు అన్ని భాషల్లో అభిమానులు పెరిగిపోయారు.మరోప్రక్క ఈ చిత్రం సీక్వెల్ ‘కేజీఎఫ్ 2’ సినిమా త్వరలో రాబోతుంది. షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ నెల 8న యష్ పుట్టిన రోజు సందర్భంగా కేజీఎఫ్ 2 టీజర్ ను విడుదల చేయనున్నారు. దాంతో ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్లు ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

ఈ నేపధ్యంలో తాజాగా ఈ సినిమాలో కీ పాత్రలో కనిపించనున్న బాలీవుడ్‌ హీరోయిన్‌ రవీనా టాండన్‌ తన పాత్రపై కొన్ని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. వాటిని కేజీఎఫ్ చిత్రం అభిమానులు వైరల్ చేస్తున్నారు. రెగ్యులర్ గా ఏదైనా సినిమా సీక్వెల్‌లో నటించే ఆఫర్‌ వస్తే ముందుగా ఆ సినిమాను చూశాకే ఓకే చేస్తారు. కానీ రవీనా మాత్రం దానికి భిన్నంగా.. కేజీఎఫ్‌ సినిమాను చూడకుండానే సీక్వెల్‌ చిత్రానికి ఓకే చెప్పినట్లు తెలిపింది. 

కేవలం దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ చెప్పిన స్టోరీ లైన్‌ నచ్చడంతోనే సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక సినిమాకు సైన్‌ చేశాక చిత్రాన్ని చూసిన టాండన్‌.. ఆశ్చర్యానికి గురయ్యాయనని, సినిమా అద్భుతంగా ఉందంటూ వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమాలో తన పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఆమె ఇలా చెప్పటంతో ఈ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ మరింతగా పెరిగిపోయాయి.

అలాగే ఈ చిత్రం టీజర్ విడుదలకు టైమ్ ఫిక్స్ చేసారు. ఈ సినిమా టీజర్ జ‌న‌వ‌రి 8న ఉద‌యం 10.18ని.ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ కొద్దిసేప‌టి క్రితం ప్ర‌క‌టించారు. టీజ‌ర్ కోసం భాషా భేధం లేకుండా దేశమంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తుంది. 

`కేజీఎఫ్`కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇటీవలె క్లైమాక్స్ సన్నివేశాలను భారీగా షూట్ చేసారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ పవర్‌ఫుల్ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

 కేజీఎఫ్: చాప్టర్ 2 మరోసారి కల్ట్ రాకీ పాత్రలో యష్‌ చేస్తున్నారు. సంజయ్ దత్ పోషించిన అధీరా రూపంలో అతను ఈసారి పెద్ద థ్రెట్ ఎదుర్కొ బోతున్నాడు. శ్రీనిధిశెట్టి, ప్రకాష్‌రాజ్‌, ఆనంత్‌నాగ్‌, రావు రమేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి బ‌స్రూర్ సంగీతం అందిస్తున్నారు. అతి త్వరలోనే విడుదల తేదీకి సంబంధించి మేకర్స్ నుండి అఫీషియల్ ఎనౌన్సమెంట్ కోసం వేచి చూద్దాం.