తెలుగులో యంగ్ ప్రొడ్యూసర్‌గా రాణించిన అభిషేక్ నామాపై డేటింగ్ వార్తలొచ్చాయి. ఓ హీరోయిన్‌తో ఆయన డేటింగ్‌కి వెళ్లినట్టు ఫిల్మ్ నగర్ సర్కిల్‌లో వార్త చక్కర్లు కొట్టింది. తాజాగా దీనిపై ఆయన ఓపెన్ అయ్యారు.
చిత్ర పరిశ్రమలో చాలా వరకు హీరో, హీరోయిన్ల మధ్య డేటింగ్ రూమర్స్ వస్తుంటాయి. కలిసి నటిస్తుంటారు. కలిసి బయట కనిపిస్తుండటంతో ఈ రూమర్స్ స్ప్రెడ్ అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో డైరెక్టర్, హీరోయిన్ మధ్య రూమర్లు కూడా వినిపిస్తుంటాయి. కానీ ఓ నిర్మాత, హీరోయిన్‌తో కలిసి డేటింగ్ రూమర్స్ రావడం చాలా అరుదు. కానీ ఆ మధ్య తెలుగులో యంగ్ ప్రొడ్యూసర్‌గా రాణించిన అభిషేక్ నామాపై డేటింగ్ వార్తలొచ్చాయి. ఓ హీరోయిన్‌తో ఆయన డేటింగ్‌కి వెళ్లినట్టు ఫిల్మ్ నగర్ సర్కిల్‌లో వార్త చక్కర్లు కొట్టింది.
తాజాగా దీనిపై ఆయన ఓపెన్ అయ్యారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత అభిషేక్ నామా దీనిపై స్పందించారు. విలేకరి అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పారు. తాను ఎవరితోనూ డేటింగ్‌లో లేనని వెల్లడించింది. అవి జస్ట్ రూమర్స్ మాత్రమే అని తెలిపారు. ఇలాంటివన్నీ సునీల్ నారంగ్(నిర్మాత) చెబుతుంటాడని అన్నారు. సునీల్ నారంగ్, అభిషేక్ నామా స్నేహితులు, గతంలో బిజినెస్ పార్టనర్స్ గానూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చెప్పి ఉంటాడని, ఇలాంటివన్నీ ఆయనే చెబుతుంటాడని చెప్పడం విశేషం. లంచ్‌కి, డిన్నర్‌కి వెళ్తున్నా అనేది ఉట్టిమాటలని తెలిపారు. ఏ నిర్మాతకి రాని రూమర్స్ మీపైనే రావడం ఏంటి? అన్ని ప్రశ్నించగా, అవన్నీ నిజం కాదని, గాసిప్స్ అంటూ కొట్టిపారేశాడు. తాను ఎవరితోనూ డేటింగ్ లో లేనని వెల్లడించారు.
ప్రస్తుతం అభిషేక్ నామా.. చాలా గ్యాప్‌తో రవితేజతో `రావణాసుర` చిత్రాన్ని నిర్మించారు. ఇది ఈనెల 7న విడుదల కానుంది. ఈ సినిమాకి అసలు నిర్మాత రవితేజ అని, తనే `ఆర్‌టీ పిక్చర్స్` పతాకంపై నిర్మించాలనుకున్నారని, ఆయన హీరోగా బిజీ కావడంతో తన సపోర్ట్ తీసుకున్నారని, తాను ప్రొడక్షన్ చూసుకున్నానని చెప్పారు. ఈ అవకాశం తనకు ఇవ్వడం గొప్పగా భావిస్తున్నానని చెప్పారు. `రావణాసుర` టైటిల్ కూడా తన సలహా మేరకే పెట్టామన్నారు. రవితేజ, సుధీర్ వర్మ, రైటర్ శ్రీకాంత్ కాంబినేషన్‌లోనే తమ బ్యానర్‌లో మరో సినిమా ఉందన్నారు. `రావణాసుర` బిజినెస్ అయిపోయిందని, థియేట్రికల్ సొంతంగా రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. నాన్ థియేట్రికల్‌గా ఇప్పటికే సినిమా అమ్ముడుపోయిందని, సేఫ్‌లోనే ఉన్నామన్నారు.
ఇప్పుడు థియేట్రికల్ రెవెన్యూపై నమ్మకం లేదని, సినిమా బాగుంటే తప్ప థియేటర్ రెవెన్యూ వచ్చే పరిస్థితి లేదని, అందుకే నాన్ థియేట్రికల్ బిజినెస్ నిర్మాతలకు హెల్ప్ అవుతుందన్నారు. ఇక డిస్ట్రిబ్యూషన్ గా సినిమాలు తగ్గించడంపై ఆయన స్పందిస్తూ డిస్ట్రిబ్యూషన్ లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నాయని, 85శాతం కమీషన్ ఇవ్వాల్సి వస్తుందని, దీంతో దాన్ని తగ్గించుకున్నట్టు చెప్పారు. ఇకపై సినిమాలు నిర్మించే నిర్మాతలే డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని, దీంతో ఒక సినిమాతో పోయినా, మరో సినిమాతో మ్యానేజ్ చేసుకోవచ్చని, కేవలం డిస్ట్రిబ్యూటర్‌గా ఉంటే ఒక్క సినిమా పోతే ఆ నష్టాలను భర్తీ చేయడం చాలా కష్టమని చెప్పారు.
డిస్ట్రిబ్యూటర్‌గా పాపులర్ అయిన అభిషేక్ నామా నిర్మాతగా మారి `బాబు బాగా బిజీ`, `కేశవ`, `సాక్ష్యం`, `గూఢచారి`, ఇప్పుడు `రావణాసుర` చిత్రాలను నిర్మించారు. కళ్యాణ్ రామ్‌తో `డెవిల్` చేస్తున్నారు. `బాబా బాగా బిజీ`లో శ్రీనివాస్ అవసరాల హీరోగా నటించగా, ఆయనకు జోడీగా మిస్తీ చక్రవర్తి, తేజస్విని, సుప్రియా, శ్రీముఖి హీరోయిన్లుగా నటించారు. `కేశవ`లో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించగా, రీతూ వర్మ, ఇషా కప్పికర్ హీరోయిన్లుగా, `సాక్ష్యం`లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చేయగా, పూజా హెగ్డే హీరోయిన్, `గూఢచారి`లో అడివి శేష్ హీరోగా చేయగా, శోభితా దూళిపాళ్ల హీరోయిన్‌గా నటించింది.
